భారత్ వర్సెస్ వెస్టిండీస్: గేల్ ఫోటో పెట్టిన అమితాబ్
ముంబై: వెస్టిండీస్ - భారత్ మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లోని తన ఖాతాలో గేల్ ఫోటోను ఉంచారు.
ఇటీవల అమితాబ్ బచ్చన్ ఆతిథ్యం తనని ముగ్ధుడిని చేసిందని క్రిస్‌గేల్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. తనకు ఎంతో ఇష్టమైన నటుడి నుంచి ఊహించని ఆతిథ్యం అందుకోవడంతో క్రిస్‌గేల్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

అమితాబ్ బచ్చన్‌కి క్రిస్‌గేల్ వీరాభిమాని. అమితాబ్ ఇచ్చిన ఆతిథ్యం పట్ల క్రిస్‌గేల్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మేరకు బిగ్ బీ అమితాబ్ తనని ఇంటికి పిలిచి.. విందు ఇచ్చాడని, ఆయన ఆతిథ్యం తనను ముగ్ధుడిని చేసిందని గేల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వెల్లడించాడు.
T 2191 - Large left over cut outs of my 70th birthday celebration in drive way of my office, and THE MAN Chris Gayle pic.twitter.com/uPGbZgK9xZ
— Amitabh Bachchan (@SrBachchan) March 30, 2016
'మీ ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చినందకు కృతజ్ఞతలు. చాలా పుస్తకాలు కూడా కానుకగా ఇచ్చారు. బాస్ నేను సెంచరీ కొట్టాలి, కానీ ఇండియానే గెలువాలని కోరుకున్నారు. నేను మాత్రం సెంచరీ కొట్టకపోయినా పర్వాలేదు మేము గెలువాలని కోరుకుంటున్నా' అని జైమకైన్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. కాగా, ఈ రోజు మ్యాచులో అమితాబ్ మాట నెగ్గుతుందా, గేల్ మాట నెగ్గుతుందా చూడాలి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications