అభిమానం నెత్తికెక్కడమంటే ఇదే..! అమ్మ మాత్రం హ్యాండ్ ఇచ్చేసింది

చెన్నై : సినిమాలైనా.. రాజకీయాలైనా.. తమిళ జనం అభిమానమే వేరు. నచ్చితే నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు, అవసరమైతే అదే నెత్తిని నున్నగా గీయించుకుని మరీ తమ అభిమానమంటూ చాటుకుంటారు. తమిళ ప్రజల ఆరాధ్య నేత అమ్మ జయలలిత కోసం ఇదే పని చేశారు కొంతమంది ఆమె అభిమానులు.

మొన్నటి తమిళ ఎన్నికల్లో జయలలిత పార్టీ అన్నాడీఎంకే 134 స్థానాల్లో విజయం సాధించి, ఆరోసారి జయలలిత సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో అమ్మపై తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకోవాలని ప్రయత్నించిన కొంతమంది జయలలిత అభిమానాలు.. అన్నాడీఎంకే గెలిచిన 134 స్థానాలకు సరిసమానంగా 134 గుండ్లతో అమ్మ ఇంటి ముందు దర్శనమిచ్చారు.

amma fans shaved their heads

అయితే.. బిజీగా ఉన్నారో, లేక ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదనుకున్నారో గానీ మొత్తానికి 134 గుండ్లకు హ్యాండ్ ఇచ్చారు జయలలిత. అభిమానంతో గుండు చేయించుకుని వస్తే, అమ్మ కలవలేదన్న నిరాశతో వారంత అక్కడి నుంచి వెనుతిరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+