కన్న కూతురి పైనే అత్యాచారానికి తెగబడ్డ తండ్రి: 'షాక్'లో కూతురు
కడుపున పుట్టిన బిడ్డ అన్న కనీస మానవత్వం లేకుండా ఓ కీచక త్రండి కూతురి పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి అత్యాచారంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైన బాలిక, మానసికంగా కృంగిపోయింది.
అమృత్సర్: కడుపున పుట్టిన బిడ్డ అన్న కనీస మానవత్వం లేకుండా ఓ కీచక త్రండి కూతురి పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి అత్యాచారంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైన బాలిక, మానసికంగా కృంగిపోయింది.
స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలిక పరిస్థితిని ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు గుర్తించింది. ఆపై విషయం ఆరా తీయగా.. తండ్రి తనపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలిపింది. అటు తర్వాత ఉపాధ్యాయురాలి సహాయంతో శుక్రవారం నాడు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. సదరు కీచక తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా, బాధిత బాలిక తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో ఆమె తల్లి బీహార్ లోని తన స్వంత గ్రామానికి వెళ్లిపోయింది. అప్పటినుంచి బాలిక ఒంటరవడంతో ఆమె తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రి అత్యాచారంతో బాలిక ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేపోతున్నట్లు తెలుస్తోంది.