అమృత జయలలిత కుమార్తె కాదు, అమ్మ సోదరుడు వాసుదేవన్, ఎవరి కుమార్తె అంటే?

బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె తానే అంటూ బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అమృత జయలలిత కుమార్తె కాదని, ఆమె జయలలిత సోదరి శైలజ కుమార్తె అని అమ్మ సోదరుడు వాసుదేవన్ అన్నారు.

తాను జయలలిత కుమార్తె, డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించాలని బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం సుప్రీం కోర్టు అమృత అలియాస్ మంజుల సమర్పించిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపధ్యంలో ఓ మీడియా సంస్థ జయలలిత బంధువుల నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నించింది.

Amrutha is not the daughter of Jayalalithaa says Vasudevan

జయలలిత తండ్రి జయరామన్ మొదటి భార్య కుమారుడైన వాసుదేవన్ కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని టీ. నరశీపురం తాలుకాలోని రంగరాజపురంలో నివాసం ఉంటున్నారు. జయలలిత సోదరుడైన వాసుదేవన్ మీడియాతో మాట్లాడుతూ అ అమృత జయలలిత కుమార్తె కానేకాదని స్పష్టం చేశారు.

జయలలిత సోదరి శైలజ కుమార్తె అమృత అని చెప్పారు. అయితే అమృత తాను జయలలిత కుమార్తె అంటూ ఎందుకు కోర్టుకు వెళ్లిందో మాకు అర్థం కావడం లేదని వాసుదవన్ అన్నారు. జయలలిత మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని తాను ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యాలయానికి లేఖ రాశానని వాసుదేవన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+