మోడీకి రాహుల్ హగ్: అమూల్ ఫీచర్ ఫొటో మామూలుగా లేదు!
Recommended Video

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని శుక్రవారం పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగలించుకోవడంతోపాటు ఆ తర్వాత కన్ను కొట్టడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా, ఇలాంటి అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు డైరీ కో-ఆపరేటివ్ సంస్థ అమూల్ ఊరికే ఉండదు కదా! అందుకే ఎప్పటిలాగే అమూల్ కూడా ఈ ఘటనను ఎంతో ఆసక్తికరంగా రూపొందించింది. ఇప్పుడు అమూల్ వేసిన సెటైరికల్ ఫీచర్ ఇప్పుడు నెటిజన్లు అమితంగా ఆకట్టుకుంటోంది.
#Amul Topical: Hugs in Parliament.... pic.twitter.com/dNurd7XDaX
— Amul.coop (@Amul_Coop) July 20, 2018
రాహుల్, మోడీని కౌగిలించుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. 'ఆలింగనంగా ఉందా? లేక ఇబ్బందికరంగా ఉందా?' అంటూ ఓ ఫొటోను విడుదల చేసింది. అంతేగాక, అందులోనే రాహుల్ గాంధీ కన్నుకొట్టడాన్ని కూడా స్కెచ్ వేసింది. కరెంట్ టాపిక్స్‌తో అమూల్ విడుదల చేసిన అనేక క్రియేటివ్ పిక్చర్స్ ఇప్పటికే ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.

'అమూల్ హగ్స్ బ్రెడ్ డైలీ' అనే కొటేషన్ కూడా ఇవ్వడంతో మరింత ఆకర్షణీయంగా ఈ ఫీచర్ ఫొటో ఉంది. తమ ఉత్పత్తుల ప్రమోషన్ చేయడంలో అమూల్‌ను మించిన వారు లేరంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా, రాహుల్, మోడీపై వేసిన ఈ ఫీచర్ ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అంతేగాక, అమూల్ ఫీచర్ ఫొటోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications