బట్టర్ ఇచ్చిన సుందరాంగి: అమూల్ బాహుబలి యాడ్
ఢిల్లీ: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రాణా ప్రధానపాత్రలుగా వచ్చిన బాహుబలి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయి, కలెక్షన్ల వర్షం కురుపిస్తోంది. ఈ నేపథ్యంలో అమూల్ విలక్షణ అడ్వర్టెయిజ్మెంట్‌తో ఆకట్టుకుంది.
పాలు, పాల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా అమూల్ సంస్థ పేరు గాంచింది. బాహుబలి హిట్ అయిన నేపథ్యంలో అమూల్ ట్విట్టర్‌లో ఈ సినిమా పైన స్పందించింది.

యుద్ధ రంగంలో ఉన్న బాహుబలికి ఓ అమ్మాయి అమూల్ బట్టర్ రాసి బ్రెడ్ ముక్కలను ఇస్తుంది. దానిని బాహుబలి బాగుందంటూ తింటున్నట్లుగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని భల్లాలదేవ కోపంతో చూస్తున్నట్లుగా ఉంటుంది.
అమ్మాయి తన ఎడమ చేతిలో నల్లటి ప్లేటులో దానిని ఉంచి, బాహుబలికి అందిస్తుంటుంది. ఈ కొత్త యాడ్‌కు.. బాహుబలి బట్టర్లీ అంటూ కాప్షన్ ఇచ్చింది. అమూల్ మాసివ్ హిట్ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చింది. బాహుబలి హవా నేపథ్యంలో అమూల్ పోస్టుకు ట్విట్టర్లో మంచి స్పందన కనిపిస్తోంది.
Thanks for the toast @Amul_Coop :D pic.twitter.com/xh8vqDqaQu
— Baahubali (@BaahubaliMovie) July 21, 2015 











Click it and Unblock the Notifications