Air India: జైపూర్‍లో అత్యవసరంగా విమానం ల్యాడింగ్.. అలిగిన పైలట్..!
పైలట్ చేసిన నిర్వాకంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన జైపూర్ లో జరిగింది. శనివారం రాత్రి ఎయిర్ ఇండియా విమానం లండన్ నుంచి ఢిల్లీకి బయల్దేరంది. ఎయిరిండియా విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగేందుకు ప్రయత్నిం చేసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడే చక్కర్లు కొట్టింది.
వాతావరణ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విమానాన్ని రాజస్థాన్ లోని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. రెండు గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ అధికారులు విమానం రావడానికి అనుమతి ఇచ్చారు. కానీ పైలట్ మాత్రం ఫ్లైట్ ను టేకాఫ్ చేయడానికి నిరాకరించాడు. తన డ్యూటీ టైమ్ అయిపోయిందని చెప్పాడు.

విమానంలో దాదాపు 350 మంది ప్రయాణికులు సుమారు మూడు గంటల పాటు అక్కడే వేచి ఉండవాల్సి వచ్చింది. అయితే కొందరు రోడ్డు మార్గన ఢిల్లీ వెళ్లిపోయారు. కొందరు మాత్రం జైపూర్ లోనే ఉండిపోయారు.
ఎయిర్ ఇండియా చివరికి ప్రత్యమ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో విమానంలో ఢిల్లీకి వెళ్లింది. ప్రయాణికులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"AI-112 విమానం ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది, అయితే ఢిల్లీ చుట్టూ ఉన్న గగనతలం పైన వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో జైపూర్‌కు మళ్లించారు.విమానం తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి క్లియరెన్స్ పొందింది, అయినప్పటికీ, 'మా డ్యూటీ సమయం ముగిసింది' అని పేర్కొంటూ పైలట్‌లు ప్రయాణించడానికి నిరాకరించారు" అని ప్రయాణికులు తెలిపారు.
ట్వీట్టర్ వేదికగా దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. "ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తమ బృందం తమ వంతు ప్రయత్నం చేస్తోంది" అని పేర్కొంది.












Click it and Unblock the Notifications