రాష్ట్రపతి భవన్‌లో చిరుత హల్‌చల్: మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో..!!
PM Modi new cabinet meeting: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ ప్రధానిగా ఆయన ప్రమాణం చేయడం వరుసగా ఇది మూడోసారి.
ఈ కార్యక్రమానికి పలువురు ఆహ్వానితులు హాజరయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది. మోదీ పాటు మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 61 మంది బీజేపీ, 11 మంది ఎన్డీఏ అలయెన్స్ ఎంపీలు ఉన్నారు.

కాగా- నేడు ప్రధానమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ కానుంది. ఈ సాయంత్రం ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ సహా మిగిలిన వారందరూ ఇందులో పాల్గొననున్నారు.
కాగా- మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రపతి భవన్‌లో వన్యప్రాణి సంచరిస్తోండటం కనిపించింది. దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేస్తోన్నప్పుడు, రిజిస్టర్‌లో సంతకం చేస్తోన్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ కారిడార్‌లో ఈ జంతువు తిరుగాడటం వీడియోల్లో రికార్డయింది.
Is that a wild animal in the background, strolling in the Rashtrapati Bhawan? pic.twitter.com/OPIHm40RhV
— We, the people of India (@India_Policy) June 10, 2024
దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ జంతువును చిరుతగా భావిస్తోన్నారు పలువురు నెటిజన్లు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని పెంచుకుంటోన్నారంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.












Click it and Unblock the Notifications