శశికళ ఎఫెక్ట్: మరో లేఖతో కలకలం, జైల్లో చాల మంది వీవీఐపీలు, ఖరీదైన దంపతులు!
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అవ్యవహారాల విషయం ఇప్పుడు పెద్దరాద్దాంతం అయ్యింది. అక్రమాస్తుల కేసులో శిక్ష పడిన అన్నాడీఎంకే (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వీవీఐపీ సేవలు అందిస్తున్నారని ఇటీవల డీఐజీ రూప బాంబు పేల్చిన విషయం తెలిసిందే.
శశికళ కుటుంబ సభ్యుల దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకుని ఆమెకు జైల్లో వీవీఐపీ సేవలు అందిస్తున్నారని ఆరోపిస్తూ డీఐజీ రూప పై అధికారులు, కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఏడీజీపీ మేఘరిక్ కు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాల గురించి మరో లేఖ రాశారు.

గుర్తు తెలియన అధికారి !
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విధుల్లో ఉన్న ఓ గుర్తు తెలియని అధికారి ఏడీజీపీ మేఘరిక్ కు లేఖ రాశారు. జైల్లో అన్నాడీఎంకే పార్టీ నాయకురాలు శశికలతో పాటు అనేక మందికి వీవీఐపీ సేవలు చేస్తున్నారని, ఇది నిత్యం జరుగుతున్న బహిరంగ రహస్యం అని లేఖలో రాశారు.
Recommended Video


క్రిమినల్ కేసుల్లో నిందితులకు ?
అనేక క్రిమినల్ కేసుల్లో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల దగ్గర జైలులోని కొందరు సిబ్బంది మామాళ్ళు తీసుకుని వారికి వీవీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని గుర్తు తెలియన అధికారి ఏడీజీపీ మేఘరిక్ కు పూర్తి వివరాలతో లేఖ రాశారు.

వీవీఐపీ సేవలు వీరికే !
జంతకల్ మైనింగ్ కేసులో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారి గంగారామ్ బడేరియా, రూ. ఐదు కోట్లు అక్రమంగా లావాదేవీలు చేసిన జాతీయ రహదారుల అభివృద్ది ప్రాధికార సంస్థ సీపీవో ( సీనియర్ అధికారి) ఎస్.సి. జయచంద్ర తదితరులకు వీవీఐపీ సేవలు చేశారని లేఖలో వివరించారు.

ఖరీదైన దంపతులు!
డీమ్డ్ ఇఫ్ఫ్రా ప్రాజెక్ట్ అక్రమాల భారీ స్కాం కేసులో అరెస్టు అయిన సచిన్ నాయక్, దీశా చౌధరి దంపతులకు ఎంతో కాలంగా వీవీఐపీ సేవలు చేస్తున్నారని గుర్తు తెలియని అధికారి ఏడీజీపీ మేఘరికర్ కు లేఖ రాశారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.

అన్నాడీఎంకే, జైలు అధికారు లింక్
అన్నాడీఎంకే పార్టీ నాయకులు, పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని కొందరు అధికారుల మధ్య భారీ మొత్తంలో డీల్ జరిగిందని లేఖలో వివరించారు. కర్ణాటక పరిశ్రమల శాఖ సెక్యూరిటీ విభాగం సబ్ ఇన్స్ పెక్టర్ గజరాజ్ మాకనూర్ (పరప్పన అగ్రహార జైల్లో విధుల్లో ఉన్నాడు) ఈ డీల్ చేశారని గుర్తు తెలియని అధికారి లేఖలో వివరించి ఏడీజీపీ మేఘరిక్ కు పంపిచండంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications