స్నేహమేరా జీవీతం... మోసం చేసేరా రూంమేట్..!
ముంబైనగరంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. ముంబాయిలోని బోయిసార్‌లోని ఓ ఫార్మాకంపనీలో ఇద్దరు యువకులు ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఓ టీనేజ్ యువకుడితోపాటు మరోకరు కలిసి ముంబాయిలోని పాల్ఘార్ వాంగావ్‌లో కలిసి ఓ అద్దే ఇంట్లో నివాసం ఉన్నారు. ఇద్దరు ఒకే ఫార్మా కంపనీలో ఉద్యోగం చేస్తుండడంతో కొద్ది రోజుల క్రితం రూమ్ మేట్స్ తో కలసి పార్టీ చేసుకున్నారు. దీంతో పార్టీ కోసం మరో స్నేహితుడి ఇంటికి వెళ్లారు. పార్టీ కావడంతో టీనేజ్ యువకుడు ఫుల్ గా మద్యం సేవించాడు. దీంతో టీనేజర్ మత్తులో ఒళ్లు తెలియకుండా పడుకున్నాడు. దీంతో తమ రూంకు వెళ్లేందుకు టీనేజర్ ను రూంమేట్ పిలిచాడు. అప్పటకే మద్యం మత్తులో నిద్రపోయిన టీనేజర్ ఎంతా పిలిచినా లేవలేదు..దీంతో టీనేజర్ రూంమేట్ కు స్నేహితుడనే విషయం మరిచిపోయాడు తన బుర్రలోకి ఓ తెలివితక్కువ ఐడియాను తెచ్చుకున్నాడు.

ఆటపట్టిద్దాం అనుకున్నాడో ఏమో టీనేజర్ బట్టలు విప్పి న్యూడ్ గా మోబైల్ తో ఫోటోలు తీశాడు. మరుసటీ రోజు రూంకు వచ్చిన టీనేజర్‌తో బ్లాక్‌మెయిల్ కు దిగాడు. వాటిని చూపించి డబ్బును డిమాండ్ చేశాడు. ముందుగా ఆటపట్టిస్తున్నాడని భావించిన టీనేజర్ భావించాడు..ఫోటోలు తీసీన స్నేహితుడు మాత్రం ఇదే అదనుగా డబ్బులను లాగేందుకు ప్లాన్ చేశాడు. మొత్తం రూం రెంట్ ను కట్టాలని వేధించాడు.లేదంటే న్యూడ్ ఫోటోలను ఫేస్‌బుక్ లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈనేపథ్యంలో రూంమేట్ వేధింపులను తట్టుకోలేని యువకుడు చివరకు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు విచారణ నిమిత్తం వచ్చిన పోలీసులకు టీనేజర్ న్యూడ్ ఫోటోలు లభించడంతో రూంమేట్ ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications