అండమాన్ వద్ద హిందూ మహా సముద్రంలో భారీ భూకంపం
హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. శ్రీలంకకు నైరుతి దిశగా, ఇండోనేషియా, మలేసియాలకు వాయవ్య దిశగా సముద్ర గర్భంలో భూమి ప్రకోపించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత దేశాలు ఉలిక్కిపడ్డాయి. అప్రమత్తం అయ్యాయి. అలలు ఎగిసిపడే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే బీచ్ ల వద్ద సైరన్ ను మోగించారు. తీరానికి దగ్గరగా ఉండటం వల్ల ఇండోనేషియాలో కొన్ని బీచ్ లను తాత్కాలికంగా మూసివేశారు.
దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.2 గా రికార్డయింది. ఇండోనేషియా సమీపంలోని ప్రఖ్యాత తీర ప్రాంత నగరం బందా ఏక్ కు సమీపంలో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉపరితలం నుంచి 90 కిలోమీటర్ల దిగవన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు వివరించింది. 5.305 అక్షాంశం, 93.972 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది.

అండమాన్ నికోబార్ ద్వీప సముదాయం, క్యాంప్ బెల్ బే కు 189 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఏరియా. దీని ప్రభావంతో బందా ఏక్, ఇందిరా పాయింట్ వంటి తీరాల్లో అలజడి రేగింది. కెరాటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బందా ఏక్ వద్ద సముద్రం కొంత ముందుకు చొచ్చుకు వచ్చింది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు అందలేదు.
ఈ నెల 1వ తేదీన ఇదే ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని సులావేసి- మలుకు దీవుల మధ్య గల మొలుకా సముద్రంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని తీవ్రత 7.4గా రికార్డయింది. ఫలితంగా సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. వాటి కింద చిక్కుకుని ఒకరు మరణించారు. ఇండోనేషియాలోని ద్వీప సముదాయాలు, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాలకు ప్రమాదకర సునామీ అలలు రావచ్చని పేర్కొంది.
మనాడోలో శిథిలాల కింద చిక్కుకుని ఒకరు మరణించారు. అక్కడ దెబ్బతిన్న భవనాలకు సంబంధించిన వీడియోలను కూడా ఈ బ్రాడ్ కాస్టర్ టెలికాస్ట్ చేసింది. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాల్లో ఇదీ ఒకటి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువా న్యూగినియా, న్యూజిలాండ్, అంటార్కిటికా- ఈ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉన్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications