చైనాతో యుద్ధవాతావరణ సమయంలో కార్గిల్ యుద్ధక్షేత్రంలో కంపించిన భూమి: 3 రోజుల్లో రెండోసారి
న్యూఢిల్లీ: భారత్ సహా పలు దేశాల్లో కొద్దిరోజులుగా వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక దేశంలో.. ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తోంది. స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. దేశ రాజధాని ప్రాంతంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొంటున్నాయి. న్యూఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) సహా పలు ప్రాంతాల్లో వరుసగా కొద్దో, గొప్పో భూమి ప్రకంపిస్తూనే వస్తోంది. ఢిల్లీ, గుర్‌గావ్, నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో తరచూ భూప్రకంపనలు నమోదవుతున్నాయి.
తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లఢక్‌లోని కార్గిల్ యుద్ధ క్షేత్రంలో భారీ భూప్రకంపనలు నమోదు అయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైంది. కార్గిల్‌కు ఆగ్నేయ దిశలో ఈ తెల్లవారు జామున 3 గంటల 37 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు జాతీయ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. మూడురోజుల వ్యవధిలో కార్గిల్, లఢక్ ప్రాంతాల్లో భూకంపం నమోదు కావడం ఇది రెండోసారి కావడం ఆందోళనలను కలిగిస్తోంది.

కార్గిల్‌కు ఉత్తర, ఆగ్నేయ దిశలో 433 కిలోమీటర్ల దూరం గల ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు సెస్మాలజీ సెంటర్ పేర్కొంది. ఈ నెల 2వ తేదీన కూడా లఢక్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైంది. అదే రోజు లఢక్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోనూ భూమి ప్రకంపంచింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్లు సెస్మాలజీ సెంటర్ పేర్కొంది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 3.5 మాగ్నిట్యూడ్‌తో భూమి ప్రకంపించింది.
శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 7 గంటలకు భారీగా భూప్రకంపనలు నమోదుఅ్యాయి. హర్యానా, రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో.. ప్రత్యేకించి ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో తరచూ సంభవిస్తోన్న భూకంపాలు మున్ముందు ఎలాంటి విపత్కర, విధ్వంసకర పరిస్థితులకు దారి తీస్తాయోననే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications