Crime News: బీహార్‍లో దారుణం.. ప్రియుడితో కలిసి చెల్లిని చంపిన అక్క..

బీహార్ లో దారుణం జరిగింది. ఓ అక్క సొంత చెల్లెల్ని అత్యంత దారుణంగా హత్య చేసింది. వైశాలి జిల్లాలో 13 ఏళ్ల బాలిక తన ప్రియుడి సహాయంతో తొమ్మిదేళ్ల చెల్లిని హతమార్చింది. చెల్లి సదరు బాలిక ప్రియుడితో కలిసి సన్నిహిత్యంగా ఉండగా చూసింది. ఈ విషయాన్ని చెల్లి బయటకు చెబుతుందన్న భయంతో హత్య చేశారు. మృతదేహాన్ని ఇంటి బయట పడేశారు. ఈ హత్యకు ఓ మహిళ కూడా సహకరించింది. ఓ వివాహ వేడుక కోసం బాలికల తల్లిదండ్రులు ఇటీవల వేరే ఊరికి వెళ్లారు.

పెళ్లి అనంతరం వారు ఇంటికి చేరుకున్నారు. చిన్న కుమార్తె కనిపించడం ఆందోళన చెందిన వారు అక్కను ప్రశ్నించారు. అక్క సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారి ఇంటి వెనుక బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అక్క తీరు, ఆమె ఫోన్ కాల్ రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆమెను, ప్రియుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది.

 Crime News

తన ప్రియుడితో కలిసి ఉండగా చెల్లెలు చూసినట్లు నిందితురాలు చెప్పింది. ఈ విషయం బయటకు చెప్పుతుందన్న భయంతో చెల్లెల్ని చంపినట్లు ఓప్పుకుంది. హత్య తర్వాత డెడ్ బాడీని మూడు రోజుల పాటు ఇంట్లోనే ఒక పెట్టెలో ఉంచుకున్నట్లు ఆమె తెలిపింది. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఇంటి వెనుక పడేశారు. ఆ తర్వాత ముఖాన్ని గుర్తు పట్టకుండా ఉండడానికి యాసిడ్ పోశారు. వేళ్లు కూడా నరికేశారు. బాలిక హత్యలో ఓ మహిళ కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించి ఆమెను కూడా అరెస్ట్ చేశారు.

చనిపోయిన బాలి 4వ తరగతి చదువుతుంది. పోలీసులు మొదటగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దాన్ని హత్య కేసుగా మార్చారు. మే 15న బాలికను హత్య చేయగా.. మే 19 న బాలిక ఇంటి వెనుక ఉన్న పొలంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. అక్క, ఆమె ప్రియుడు, ఆమె 32 ఏళ్ల అత్త చందా దేవి ఈ నేరంలో తమ ప్రమేయాన్ని అంగీకరించారని వైశాలి ఎస్పీ తెలిపారు. ఈ ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్పీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+