నీ భార్య చంఢాలమైన డ్రస్సులు వేసుకొని వస్తోంది, భర్తకు సాటి ఉద్యోగి మేసేజ్

వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తుంది. బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో ఓ యువకుడు ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు ఆ యువకుడు సాటి మహిళా ఉద్యోగి భర్తకు మెసేజ్ పంపించాడు. నీ భార్య చండాలమైన డ్రెస్సులు వేసుకొని కంపెనీకి వస్తోందని, ఆమె పద్ధతి మార్చుకోకపోతే ఆఫీసులోనే ఆమె ముఖం మీద యాసిడ్ పోస్తానని బెదిరిస్తూ ఆమె భర్తకు ఒక మెసేజ్ పంపించాడు.

భార్య గురించి చెడుగా మాట్లాడటమే కాకుండా ఆమె దుస్తులు గురించి చెడు ప్రచారం చేసిన ఆ వ్యక్తి పైన మహిళ భర్త రగిలిపోయాడు. మహిళ భర్త చేసిన పని తీవ్ర చర్చకు దారి తీసింది. షహబాజ్ అన్సర్ అనే వ్యక్తి రిపోర్టర్ గా పని చేస్తున్నాడు. అన్సర్ కి వివాహం అయ్యింది. అన్సర్ భార్య బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కంపెనీలో నికిత్ శెట్టి అనే యువకుడు కూడా పని చేస్తున్నాడు. అన్సర్ భార్య మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఆఫీస్ కి వెళుతుందని నికిత్ శెట్టి ఆరోపిస్తున్నాడు.

An employee who texted his husband that he will throw acid on his wife if she wears modern dresses

ఇటీవల ఆ మహిళ భర్త ఆన్సర్ ఫోన్ నెంబర్ సంపాదించిన నికిత్ శెట్టి అతనికి ఓ మెసేజ్ పంపించాడు. నీ భార్య చండాలమైన, దరిద్రమైన బట్టలు వేసుకుని ఆఫీసులో ఉద్యోగం చేయడానికి వస్తుందని, ఆమె కారణంగా ఇతరులు ఇబ్బందులు పడుతున్నారని, నీ భార్యను నువ్వు కంట్రోల్లో పెట్టాలని, ఆమె ఇలాగే డ్రస్సులు వేసుకుని ఆఫీసుకు వస్తే నేను కచ్చితంగా ఆమె ముఖం మీద యాసిడ్ పోస్తానని నికిత్ శెట్టి మహిళ భర్త అన్సర్ కు మెసేజ్ పంపించాడు.

ఈ మెసేజ్ చూసి హడలిపోయిన ఆన్సర్ ఒక ప్లాన్ చేశాడు. సోషల్ మీడియాలో నికిత్ శెట్టి పుట్టుపూర్వోత్తరాలు మొత్తం బయటకు లాగాడు. నికిత్ శెట్టి పంపించిన మెసేజ్ లు స్క్రీన్ షాట్ లు తీసి నికిత్ శెట్టి ఫోటోతో సహా బెంగళూరు సిటీ పోలీసులకు, నికిత్ శెట్టి ఉద్యోగం చేస్తున్న కంపెనీకి ట్యాగ్ చేస్తూ అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనవి చేశాడు. నికిత్ శెట్టి తన భార్య మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడని, తన భార్యకు ఏదైనా జరగరానిది జరిగితే అతనే కారణం అని ఆమె భర్త అన్సర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

An employee who texted his husband that he will throw acid on his wife if she wears modern dresses

ఈ పోస్టు వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు నికిత్ శెట్టి తీరుతో మండిపడ్డారు. ఎవడో భార్య డ్రస్సులతో నీకే ఏంరా పని అంటూ నికిత్ శెట్టిపై విరుచుకుపడ్డారు. ఈ మ్యాటర్ సీరియస్ కావడంతో ఆ కంపెనీ నికిత్ శెట్టిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. నిఖిత్ శెట్టికి ఐదు సంవత్సరాల పాటు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వకుండా బ్యాన్ చెయ్యాలని సంబంధిత కంపెనీల అసోసియేషన్ కు తాము మనవి చేస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు మహిళ భర్తకు మెసేజ్ చేశారు. మా కంపెనీలో నీ భార్యకు జరిగిన అవమానానికి మేము చింతిస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు అన్సర్ కు మెసేజ్ చేశారు. మొత్తం మీద పక్కింటోడి భార్య డ్రస్సుల గురించి చెడుగా మాట్లాడటమే కాకుండా ఆము ముఖం మీద యాసిడ్ పోస్తానని బెదిరించిన నికిత్ శెట్టికి ఇప్పుడు ఉద్యోగం పోవడమే కాకుండా అతనికి బెంగళూరు సిటీ పోలీసుల నుంచి కష్టాలు ఎదురైనాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+