Viral Video: నువ్వు దేవుడివి సామీ..! ఉద్యోగికి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన యజమాని..

కొంత మంది యజమానులు తమ ఉద్యోగులతో పని చేయించుకుని సరైన జీతం ఇవ్వరు. అయితే మంచి మనసున్న యజమానులు కూడా ఉన్నారు. ఓ యజమాని ఉద్యోగి జీతమే కాకుండా కారు కూడా ఇచ్చాడు. అదీ అలాంటి ఇలాంటి కారు కాదు ఏకంగా బెంజ్ కారే బహుమతిగా ఇచ్చాడు. కారు బహుమతిగా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రూ. 45 లక్షల కారు..

రూ. 45 లక్షల కారు..


AK షాజీ అనే యజమాని తన ఉద్యోగికి సరికొత్త బెంజ్ GLA క్లాస్ 220 Dని బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు రూ. 45 లక్షలుగా ఉంది. ఎకె షాజీ కేరళలోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల రిటైలర్ అయిన myGకి యజమానిగా ఉన్నారు. ఈ బహుమతిని అందుకున్న ఉద్యోగి సీఆర్ అనీష్.. గత 22 సంవత్సరాలుగా షాజీ దగ్గర పని చేస్తున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో..

ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో..


అనీష్ myG స్థాపించబడటానికి చాలా కాలం ముందు నుంచి షాజీతో ఉన్నాడు. అనీష్ ఈ సంస్థ మార్కెటింగ్, నిర్వహణ, వ్యాపార అభివృద్ధి విభాగాలలో పని చేశాడు. ప్రస్తుతం, అతను myG చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా ఉన్నాడు. ఉద్యోగికి కారు గిఫ్ట్ ఇచ్చిన వీడియోను షాజీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

గతంలో కూడా బహుమతులు..

గతంలో కూడా బహుమతులు..


అనీష్ కు సోదర ఆప్యాయత, ఏకాగ్రత, పని పట్ల అంకితభావం ఉందని షాజీ అన్నాడు. షాజీ తన ఉద్యోగికి బహుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చాడు షాజీ. కార్లే కాకుండా ఉద్యోగులకు ఫారిన్ ట్రిప్పులు ఆఫర్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+