జిమ్ సెంటర్ లో షాక్, మహిళ స్నానం చేస్తుంటే ఫ్రీగా వీడియో తీసిన కోచ్, సీసీటీవీల్లో సినిమా !
బెంగళూరు: మారుతున్న టెక్నాలజీతో చాలా ఉపయోగాలు ఉన్నా అంతగానే లేనిపోని సమస్యలు వస్తున్నాయి. సిటీ కల్చర్ కు అలవాటుపడిన చాలా మంది వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి వీలు చిక్కినప్పుడు జిమ్ కు వెళ్లి వస్తున్నారు. చాలా మంది వర్కౌట్ లు చెయ్యడానికి సమీపంలోని జిమ్ సెంటర్లలో సభ్యతం తీసుకుంటున్నారు. సిటీల్లో జిమ్ సెంటర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ప్రతి ఏరియాలో లెక్కలేనన్ని జిమ్ సెంటర్లు. వర్కౌట్ సెంటర్లు ఉన్నాయి. ఇక పలు ప్రాంతాల్లో టెన్నీస్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు తదితర క్రీడలకు సంబంధించిన అన్ని ఒకేచోట ఉంటున్నాయి, జిమ్ సెంటర్లలో, స్విమ్మింగ్ పూల్స్, క్రీడలు నేర్పించడానికి ప్రత్యేకంగా కోచ్ లు ఉంటారు. ఇలాంటి చోట్ల కొందరు కోచ్ లు కామంతో రగిలిపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురౌతాయని వెలుగు చూసింది.

వర్కవుట్ అనంతరం మహిళ ఫిట్‌నెస్ సెంటర్‌లోని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఎరోటిక్ కోచ్ తన మొబైల్ ఫోన్‌లో ఆమె నగ్న వీడియోలు చిత్రీకరించిన సంఘటన బెంగళూరు నగరంలోని బానసవాడిలోని ఎన్నారై లేఅవుట్‌లో చోటుచేసుకుంది. నిందితుడు సిబిచన్ కేఎస్ అనే నిందితుడిని బెంగళూరులోని బాణసవాడి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు రామమూర్తినగర్‌లోని కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌లో బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి అక్కడ చేరింది.
శిక్షణ పొందుతున్న మహిళకు సిబిచన్ కేఎస్ కోచ్‌గా ఉన్నాడు. ఇటీవల స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన తరువాత ఆమె స్నానం చేసేందుకు బాత్‌రూమ్ లోకి వెళ్లింది. ఆ మహిళ స్నానం చేస్తున్న సమయంలో ఎరోటిక్ కోచ్ కిటికీలో నుంచి మొబైల్ ఫోన్ తో ఆమె నగ్న వీడియో తీశాడు. కిటికీ దగ్గర చప్పుడు కావడంతో ఆమె బయటకు వచ్చేసరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చి జిమ్ మేనేజర్ దీపక్‌కు ఆమె ఫిర్యాదు చేసింది.
జిమ్ సెంట్ మేనేజర్ దీపక్ తో పాటు అక్కడి సిబ్బంది ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడు కిటికీలో నుంచి ఆమె స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీశాడని వెలుగులోకి వచ్చింది. అనంతరం మహిళ బానసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాణసవాడి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విషయం వెలుగు చూడటంతో ఆ జిమ్ సెంటర్ కు వెళ్లేవాళ్లు, స్విమ్మింగ్ పూల్ కు వెళ్లి వస్తున్నవాళ్లు, వర్కౌంట్ లు చెయ్యడానికి అక్కడికి వెలుతున్న యువతులు, మహిళలు ఉలిక్కిపడ్డారు.












Click it and Unblock the Notifications