Delhi: ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. స్కూల్ సమీపంలో పేలుడు..!

దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. సీఆర్ఫీఎఫ్ పాఠశాలకు సమీపంలో పేలుడు జరగడంతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోహిణి జిల్లాలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల బయట ఆదివారం ఉదయం 7:50 గంటలకు పేలుడు జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థిలికి చేరుకున్నారు. పేలుడు దాటికి స్కూల్ గోడ, పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు.

ఈ పేలుడుతో పాఠశాలలోని ఎవరికి ఏం జరగలేదు. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. అదే పాఠశాల గోడను ఆనుకుని అనేక దుకాణాలు ఉన్నాయి. సిలిండర్ పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు చెప్పారు. పేలుడుకు గల కారణాన్ని గుర్తించేందుకు క్లూస్ టీమ్, బాంబు స్వ్కాడ్ రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు చేస్తున్నారు.

An explosion occurred near a CRPF school in Delhi

" పేలుడు కారణంగా పాఠశాల గోడ కాస్త ధ్వంసం అయింది. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సమీపంలోని దుకాణం అద్దాలు, దుకాణం సమీపంలో పార్క్ చేసిన కారు ధ్వంసమయ్యాయి. ఎవరికీ గాయాలు కాలేదు. సంఘటనా స్థలానికి క్రైమ్ టీమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లను రప్పించాం. అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలంలో ఉంది. పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నాం" అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్‌తో సహా సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని పరిశీలిస్తున్నారని తెలిసింది.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉదయం 7.47 గంటలకు భారీ పేలుడు సంభవించినట్లు తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని పోలీసులు చెప్పారు. ఢిల్లీలో ఇప్పటికే వాయు కాలుష్యం పెరిగిపోయింది. తాజా పేలుడుతో ఆ ప్రాంతంలో గాలి మరింతగా కాలుష్యం అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+