Scary Video: ప్రాణాలు అరచేతిలో పట్టుకున్న శ్రీనగర్ విమాన ప్రయాణికులు
Delhi Srinagar Flight: దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాలు అతి భారీ వర్షాలను ఎదుర్కొంటోన్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలను చవి చూస్తోన్నాయి. కాశ్మీర్ నుంచి మధ్యప్రదేశ్ వరకూ వర్షాలు కుమ్మేస్తోన్నాయి. ఈ భారీ వర్షాలకు డస్ట్ స్టార్మ్ కూడా తోడయ్యాయి. ప్రత్యేకించి దేశ రాజధాని దీని బారిన పడింది.
ఈ సాయంత్రం ఒక్కసారిగా ఢిల్లీ వాతావరణం మారిపోయింది. భీకరంగా తయారైంది. హోరుమంటూ ఈదురుగాలులు ఢిల్లీవాసులను భయపెట్టాయి. అదే సమయంలో డస్ట్ స్టార్మ్ ఈ నగరాన్ని చుట్టుముట్టింది. 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో దుమ్ము లేచిందక్కడ. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాలు దీని బారిన పడ్డాయి.

డస్ట్ స్మార్మ్ చెలరేగిన సమయంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. తూర్పు ఢిల్లీలోని యమునా విహార్, భజన్ పురా, గోకుల్ పురి.. ప్రాంతాల్లో అంధకారం ఏర్పడింది. ఒకవంక వర్షం, దుమ్ము తుఫాన్, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో జనం ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమానాల రాకపోకల సమయాల్లో మార్పులు ఉంటాయని తెలిపింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించాలని సూచించింది.
భారీ వర్షాల ప్రభావం ఢిల్లీ- శ్రీనగర్ ఇండిగో విమానంపైనా కనిపించింది. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 నుంచి బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే వడగళ్ల వానలో చిక్కుకుంది. చివురుటాకులా వణికిపోయింది. ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ సాయంత్రం 5 గంటల సమయంలో 227 మంది ప్రయాణికులు, సిబ్బందితో శ్రీనగర్ కు బయలుదేరింది ఇండిగో 6ఈ 2146 విమానం. మార్గమధ్యలో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. వడగళ్ల వానలో చిక్కుకుంది.. చివురుటాకులా అటూ ఇటూ ఊగిపోయింది.
Passenger Advisory issued at 20:29 Hours#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory #BadWeather pic.twitter.com/WrQYP42x6b
— Delhi Airport (@DelhiAirport) May 21, 2025
అనూహ్యంగా తలెత్తిన ఈ పరిణామాలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గట్టిగా కేకలు పెట్టారు. తలవంచుకుని, సీట్లను గట్టిగా పట్టుకుని కూర్చుండిపోయారు. అందులో ఉన్న కొందరు ప్రయాణికులు- తమ మొబైల్ ఫోన్లల్లో దీన్ని చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం నుంచి పెద్ద ఎత్తున కేకలు వినిపించడం ఇందులో స్పష్టంగా రికార్డయింది.
We had a narrow escape from Delhi to Srinagar flight indigo. Special thanks to the captain and cabin crew. @indigo @GreaterKashmir @RisingKashmir pic.twitter.com/KQdJqJ7UJz
— I_am_aaqib (@am_aaqib) May 21, 2025
ఈ పరిస్థితులను పైలెట్లు వెంటనే శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు తెలియజేశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రతిక్షణం విమానం కదలికలను గమనిస్తూ వచ్చారు. పైలెట్లకు తగిన సమాచారాన్ని చేరవేశారు. ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications