ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
ఎన్నో ఏళ్లుగా బెంగళూరుకు దూరంగా ఉన్న కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు (కేఐఏడీబీ) మళ్లీ బెంగళూరులో తెరమీదకు వచ్చింది. బెంగళూరు సిటీ సమీపంలోని బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని సర్జాపూర్ చుట్టూ భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమిళనాడు రాష్ట్రం సరిహద్దులోనే వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయని సమాచారం.
డెక్కన్ హెరాల్డ్ నివేదించిన ప్రకారం తమిళనాడు సరిహద్దులోని బెంగళూరు గ్రామీణ జిల్లాలో 647 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్క్ రానుంది. బెంగుళూరుపై ఇప్పటికే అన్ని రకాలుగా తీవ్ర ఒత్తిడి నెలకొనింది. కొత్త పారిశ్రామిక స్థాపనపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన చివరి బోర్డు సమావేశంలో అత్తిబెలె- సర్జాపూర్ మధ్య ఉన్న ఆరు గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు ప్రతిపాదనకు కేఐఏడీబీ అమోదం తెలిపిందని డెక్టన్ హెరాల్డ్ నివేదిక తెలిపింది.

బెంగళూరులో తమ వ్యాపారాలను ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ గ్రామాల్లో భూసేకరణ అధికారులు సిద్దం అవుతున్నారు. అనేకల్ తాలూకాలోని సర్జాపుర సమీపంలోని బిక్కనహళ్లి, ఎస్ మేడహళ్లి, అడిగర కల్లహళ్లి, సొళ్లేపుర, ముత్తా నల్లూరు, అమనికెరె, హందేనహళ్లి చెరువులు ఈ పారిశ్రామిక పార్కు పరిధిలోకి రానున్నాయి.
బోర్డు ఆమోదం పొందిన ఒక నెల తర్వాత కేఐఏడీబీ ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు తెలిసింది. పారిశ్రామిక ప్రాంతాల్లో దళిత పారిశ్రామికవేత్తలకు రిజర్వ్‌డ్ భూముల పెంపు ఉండటం వలన బెంగళూరులో పరిశ్రమలు స్థాపించాలని పారిశ్రామికవేత్తల నుంచి విపరీతమైన డిమాండ్ ఉందని, అయితే తగినంత భూమి అందుబాటులో లేదని కేఐఏడీబీ సమావేశంలో పేర్కొంది.
బొమ్మసంద్ర, జిగణి, దొమ్మసంద్ర లింక్ రోడ్డు, అత్తిబెలె, వీరసంద్ర, ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి పారిశ్రామిక పార్కులు స్థలం కొరత ఉన్న చోట 3, 316 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. బోర్డు సమావేశంలో కేఐఏడీబీ ప్రత్యేక భూసేకరణ అధికారి నివేదిక పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు గ్రామాలను అత్యంత అనువైనదిగా గుర్తించింది, చాలా భూమి వ్యవసాయం చేస్తున్నారని, కొంత వరకు ఖాళీ అని పేర్కొంది. ఈ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగడం లేదని, ఈ ప్రాంతానికి 5 కి.మీ దూరంలో జాతీయ రహదారి ఉందని నివేదిక పేర్కొంది.

ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ కేసీసీఐ) ప్రతిపాదనను స్వాగతించింది. బెంగళూరులోని హార్డ్‌వేర్ పార్క్ బెంగళూరులో కేఐఏడీబీ చివరిసారిగా అభివృద్ధి చేసిన పారిశ్రామిక పట్టణం. ఛాంబర్ ప్రెసిడెంట్ రమేష్ చంద్ర లాహోటి మాట్లాడుతూ రోడ్లు, గ్రిడ్ విద్యుత్, నీరు సహా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటే ఇలాంటి పారిశ్రామిక టౌన్‌షిప్‌లు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారని నివేదిక తెలిపింది.
2014 చట్టం ప్రకారం రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందజేస్తామని కేఐఏడీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గైడెన్స్ విలువ కంటే పరిహారం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నందున, సాధారణంగా భూమి కోల్పోయిన వారి నుండి ఎటువంటి ప్రతిఘటన ఉండదని ఆయన అంటున్నారు. బెంగళూరు నగరం ఇప్పటికే నీటి కోరతతో తహతహలాడుతోంది. బెంగళూరు ట్రాఫిక్ సమస్య ఇప్పటికే నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ముందుగా ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రాంతాలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోతుందని, కొత్తగా పారిశ్రామిక పార్క్ లు అవసరం లేదని, బెంగళూరు నగరంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద బెంగళూరు గ్రామీణ జిల్లాలో కొత్త పారిశ్రామిక పార్క్ వివాదాలకు దారితీస్తుందా ?, లేక రైతులు స్వచ్చందంగా భూములు ఇస్తారా ? అని వేచిచూడాలి అని బెంగళూరు ప్రజలు అంటున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications