శ్రీమంతుల కొడుకుల టార్చర్ తట్టుకోలేక కాలేజ్ అమ్మాయి ఏం చేసిందంటే?, రెండు పేజీల్లో!
లక్నో/ఉత్తరప్రదేశ్: తనను అనేకసార్లు లైంగికంగా వేధించినా నిందితుల మీద స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసిగిపోయిన కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఓ కాలేజ్ అమ్మాయి డెత్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడింది.
రెండు పేజీల సూసైడ్ నోట్ రాసింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లోని స్థానిక పోలీసులు తన మీద లైంగిక దాడి చేసిన నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తన ఇంటి సమీపంలో నివసించే కామాంధులు నిత్యం తనను వేధింపులకు గురి చేశారని, వారి చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని కాలేజ్ అమ్మాయి డెత్ నోట్ లో రాసిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

నిందితులు ధనవంతులు కావడంతో తనతో పాటు తన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలేజ్ విద్యార్థిని డెత్ నోట్ లో ఆరోపించింది. సూసైడ్ నోట్‌లో తనను వేధింపులకు గురి చేసిన నలుగురు నిందితుల పేర్లు కూడా రాశానని, వారు తనను చంపడానికి ప్రయత్నించారని, వారి వేధింపులకు భయపడి తాను కాలేజ్ కు కూడా వెళ్లకుండా మానేశానని ఆమె డెత్ నోట్ లో వివరించింది.
కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ లో పిన్ టూ పిన్ రాసి ఆత్మహత్య చేసుకుంది. కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తరువాత మొరాదాబాద్ పోలీసులు వికేష్, అమృత్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఓ పోలీసు అధికారి స్థానిక మీడియాకు తెలిపారు. మొదటే నిందితుల మీద పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే మా అమ్మాయి బతికుండేదని కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications