హిందూ వివాహాలపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు, పాత వీడియో లీక్, తండ్రీ, కొడుక్కి !
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పదంగా ప్రకటనలు చేసి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. దీని తర్వాత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పాత వీడియో కూడా బయటకు వచ్చి వైరల్‌గా మారింది. ఇప్పుడు తండ్రికుమారుడు ఇద్దరూ హిందూ నాయకుల ఆగ్రహానికి గురి అయ్యారు.
హిందూ సంప్రదాయ వివాహాల్లో జరిగే వైదిక ఆచారాలను విమర్శించిన తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ పాత వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎంకే స్టాలిన్ పాత వీడియో విస్తృతంగా షేర్ చేయబడింది. ఇది సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. ద్రవిడ ఆత్మగౌరవ ఉద్యమంలో భాగమైన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సందర్భంగా అప్పటి డీఎంకే అధ్యక్షుడిగా హోదాలో ఉన్న ఎంకే. స్టాలిన్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయ వివాహ మంత్రాలపై తనకు నమ్మకం లేదని చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుతోంది. .

ఒక నిమిషం నలభై సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఎంకే స్టాలిన్ హిందూ సంప్రదాయ వివాహాలపై తనకున్న అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు. వేడుకలోని కొన్ని అంశాలను హైలైట్ చేస్తూ మంత్రాలు పఠిస్తూ వివాహాన్ని నిర్వహించే పూజారి దగ్గర వధూవరులు నేలపై ఎలా కూర్చుంటారో వివరించారు.
కన్నీళ్లకు దారితీసే అగ్ని పొగ, పూజారుల గందరగోళంగా అర్థంకాని భాషలో మంత్రాలు పఠించడం వంటి వివాహ సంప్రదాయాలను హాస్యభరితంగా ఇప్పటి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివరించడం వీడియోలో మనం చూడవచ్చు. ఇప్పుడు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మరో వివాదం రేపుతోంది.
M.K.Stalin calls the traditional way of marriage as indecent, filthy and obscene. Question is how many of his voters will agree with that? #சனிக்கிழமைபிரதமர் pic.twitter.com/K9OLPo8K6i
— Vishwatma 🇮🇳 (@HLKodo) February 2, 2019
గత శనివారం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా, కరోనా లాంటి అంటు వ్యాధులతో పోల్చారు. అలాంటి మతాన్ని నిర్మూలించాలని ఉదయానిధి అన్నారు. దీనిపై బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేశారు. చాలా చోట్ల ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి, బీహార్‌లో ఉదయనిధి స్టాలిన్ హిందూ మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలో ఓ లాయర్ ఉదయానిధి మీద కేసు పెట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న ఎంకే స్టాలిన్ కూడా మరో వివాదంలో చిక్కుకున్నారు.












Click it and Unblock the Notifications