సాహో కెప్టెన్ తానియా.. అసలైన సెలబ్రిటీ ఆమెనే.. ఇదేమీ టిక్‌టాక్ వైరల్ వీడియో కాదు..

ఆర్మీ కెప్టెన్ తానియా షెర్గిల్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. 72వ ఆర్మీడే పరేడ్ లో మగ జవాన్ల కాంటింజెంట్ ను లీడ్ చేయడం ద్వారా ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. గతేడాది లెఫ్టినెంట్‌ భవన కస్తూరి మొదటిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆల్-మేల్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ఎఎస్‌సి) బృందానికి నాయకత్వం వహించారు. అయితే ఆర్మీ డే పరేడ్ లో మాత్రం ఎఎస్‌సికు నాయకత్వం వహించిన తొలి మహిళ కెప్టెన్ తానియానే.

ఆర్మీడే పరేడ్ సందర్భంగా కెప్టెన్ తానియా షెర్గిల్ సాధించిన ఫీట్ కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అయింది. ''ఇది చూశాక నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అద్భుతమైన ప్రేరణ కలిగించింది. నిజమైన సెలబ్రిటీ అంటే కెప్టెన్ తానియా షెర్గిలే. ఇదేమీ టిక్ టాక్ లో వెరైటీ కోసం చేసిందికాదు. కాబట్టి ఆమె వీడియో కచ్చితంగా వైరల్ కావాల్సిందే''అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.

Anand Mahindra shares Army Captain Tania Shergill clip of Leading All-Men Contingent

26ఏళ్ల తానియా షెర్గిల్ ఆర్మీ కుటుంబం నుంచి వచ్చారు. పుట్టింది పంజాబ్ లోని హోషియార్ పూర్. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఆర్మీలో చేరారు. ఆర్మీడే పరేడ్ సందర్భంగా తానియా సాధించిన ఘనతను చూసి రాష్ట్రం పులకించిపోతున్నదంటూ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఘనంగా జరిగిన ఆర్మీడే పరేడ్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ (csd) బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొని యుద్ధ వీరులకు నివాళులర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+