కిరాక్ డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. రోబోలా మెలికలు తిరుగుతూ..! (వీడియో)

ముంబై : సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వీడియోలు పోస్టు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. అంతేకాదు "వాట్సాప్ వండర్ బాక్స్" (#Whatsappwonderbox) ట్యాగ్‌తో ఎవరైనా తనకు ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేయొచ్చు. ఆ క్రమంలో తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు పోస్టు చేశారు ఆ వీడియో. రెండు రోజుల వ్యవధిలోనే 70 వేలకు పైగా లైకులు.. 7 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని వీకెండ్ మస్తీ మజాగా దూసుకెళుతోంది.

బుడ్డోడి డ్యాన్స్.. ఇరగదీశాడుగా..!

బుడ్డోడి డ్యాన్స్.. ఇరగదీశాడుగా..!

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ పిల్లోడి వీడియో ఇప్పుడు చర్చానీయాంశమైంది. అత్యధిక వ్యూస్‌తో దూసుకెళుతున్న ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే సరదాగా నవ్వుకోవాల్సిందే. ఆ వీడియోలో ఆ పిల్లోడి ఎక్స్‌ప్రెషన్స్ ఔరా అనిపిస్తున్నాయి. రోబోలాగా మెలికలు తిరుగుతూ చేసిన డ్యాన్స్ అబ్బురపరుస్తోంది. Oh man, this has to be the coolest thing I've seen in a long time. I'm still on the floor laughing. My weekend has begun... అంటూ ఆనంద్ మహీంద్రా హ్యాపీగా ఫీలవుతూ సదరు వీడియోను షేర్ చేశారు.

స్ప్రింగులా కదిలాడు.. స్టెప్పులేసి అదుర్స్ అనిపించాడు

ఆ వీడియోలో ఓ పిల్లోడు యాంటీ థెఫ్ట్ పరికరం అమర్చిన ఓ బైకును కాలితో తంతాడు. దాంతో దాని సైరన్ మోగుతుంటుంది. అలా అది శబ్ధం చేస్తున్నంత సేపు ఆ పిల్లోడు మెలికలు తిరుగుతూ స్టెప్పులేస్తుంటాడు. ఆ సైరన్ సౌండుకు అనుగుణంగా తన వంటిని స్ప్రింగులా తిప్పేశాడు. అది కొద్దిసేపు మోగి ఆగిపోయిన తర్వాత అక్కడినుంచి మెల్లిగా జారుకుంటాడు. అదీ సంగతి. దాని గురించి అక్షరాల్లో ఎక్కువగా రాయడం కంటే మీరు ఓ లుక్కేస్తే డెఫినెంట్‌గా నవ్వుకుంటారు.

కడుపుబ్బా నవ్వుకున్నా.. నా వీకెండ్ ఇలా మొదలైందంటూ ట్వీట్

కడుపుబ్బా నవ్వుకున్నా.. నా వీకెండ్ ఇలా మొదలైందంటూ ట్వీట్

ఆ వీడియో చూసి ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. ఇంకేముంది తన ట్విట్టర్ అకౌంట్‌లోకి దాన్ని ఎక్కించేశారు. అలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద తెగ వైరల్ అవుతోంది సదరు వీడియో. ఇంతవరకు తాను ఇలాంటి వీడియో చూడలేదంటూ.. ఈ పిల్లోడి డ్యాన్స్ చూసి కడుపుబ్బా నవ్వుకున్నానంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు నవ్వును ఇంకా ఆపుకోలకపోతున్నానంటూ పేర్కొన్నారు. ఓ మ్యాన్.. నా వీకెండ్ మొదలైందంటూ రాశారు.

ఫన్నీ వీడియోలు.. టాలెంట్‌కు ప్రోత్సాహం

ఫన్నీ వీడియోలు.. టాలెంట్‌కు ప్రోత్సాహం

ఇలాంటి ఫన్నీ వీడియోలతో పాటు టాలెంట్ కనబరిచే వారి వీడియోలు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతాలో దర్శనమిస్తుంటాయి. ఆ మధ్య ఓ పెద్దాయన బూట్ల ఆసుపత్రి అంటూ బ్యానర్ పెట్టుకుని రోడ్డు పక్కన చెప్పులు రిపేర్ చేస్తూ జీవనం గడుపుతున్న ఫోటో ఆయన దృష్టికి వచ్చింది. దాంతో ఆయన అడ్రస్ కనుక్కోవాలంటూ తన సిబ్బందిని పురమాయించారు. అలా ఆ పెద్దాయనకు చిన్న షాపు పెట్టుకోవడానికి ఆర్థికసాయం అందించారట. ఇది ఒక్కటనే కాదు కొత్త ఆలోచనలను ఆనంద్ మహీంద్రా ఎంకరేజ్ చేస్తారనే టాక్ ఉంది. ఈ విధంగా ఎన్నో ఫోటోలు, వీడియోలు ఆయన వాట్సాప్ వండర్ బాక్స్ పేజీకి చేరుతుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+