సెల్‌ఫోన్ వాడకానికి చెప్పు దెబ్బ..! ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్
ముంబై : మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజానికి పనికొచ్చే ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంటారు. వాట్సాప్ వండర్ బాక్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో వండర్ ఫుల్ ఫోటోలు, వీడియోలు షేర్ అవుతుంటాయి. చాలామంది నెటిజన్లు కూడా తమ దృష్టికి వచ్చిన కొత్త కాన్సెప్టులు గానీ, చిత్రవిచిత్రమైన ఫోటోలు, వీడియోలు వాట్సాప్ వండర్ బాక్స్ కు షేర్ చేస్తుంటారు.
These are the perfect covers for cellphones. Should prevent overuse since we’ll effectively be ‘slipper-slapping’ ourselves every time we use them...#whatsappwonderbox pic.twitter.com/gpIgzbymFx
— anand mahindra (@anandmahindra) January 27, 2019
తాజాగా ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సెల్‌ఫోన్ వాడకం వీపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ లో పెట్టిన ఫోటో ఆలోచింపజేసే విధంగా ఉంది. చెప్పులను పోలి ఉండే కవర్లు సెల్‌ఫోన్లకు సరిగ్గా సూట్ అవుతాయని.. ఎక్కువ మొబైల్స్ వాడకుండా ఇవి ఉపయోగపడతాయన్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి కవర్లను ఫోన్లకు పెట్టుకుంటే మొబైల్ వాడే ప్రతిసారి చెప్పుతో కొట్టుకున్నట్లు అనిపించి వాడకం తగ్గుతుందేమో అనేది ఆయన అంతరంగం. వాస్తవానికి ఈ ఫోటో జనవరి 27వ తేదీన పోస్ట్ చేసినప్పటికీ.. ఇటీవలి కాలంలో బాగా వైరలయింది.

ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ పోస్టుకు భిన్నరకాలుగా నెటిజన్లు కామెంటుతున్నారు. ప్రియ అనే యువతి రీట్వీట్ చేస్తూ పోస్ట్ చేసిన ఫోటో.. ఫోన్ వాడకం ఎంతలా పెరిగిందో కళ్లకు కడుతోంది. 2007లో మనిషి చేతిలో మొబైల్ ఫోన్ బందీగా ఉంటే, ఇప్పుడు మొబైల్ గుప్పిట్లో మనిషి బందీ అయ్యాడు అనేది ఆమె కాన్సెప్ట్.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications