వార్నీ ఇదేం కేక్ కటింగ్‌రా బాబూ: కేక్ పై కూడా పొలిటికల్ రైటింగ్సేనా..!
ముంబై: సాధారణంగా ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ పై ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వారి పేరును రాస్తారు. ఆ తర్వాత బర్త్‌డే బాయ్ కేక్ కట్ చేసి తనకిష్టమైన వారి నోట్లో కేక్ ముక్క పెడతాడు. ప్రస్తుతం భారత్‌లో పొలిటికల్ సీజన్ నడుస్తున్నందున ప్రతీ వేడుకను రాజకీయాలతోనే ముడిపెడుతున్నారు మన నాయకులు. ఆఖరికి పుట్టిన రోజు వేడుకను కూడా పాలిటిక్స్‌తో లింక్ పెడుతున్నారు. లింక్ పెట్టడమే కాదు బర్త్‌డే కేక్ పై కూడా రాజకీయ సెటైర్లు వేస్తున్నారు.
ఇదిగో ఇక్కడ ఫోటోలో తెల్లచొక్కా వేసుకుని కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆనంద్ పరాంజ్‌పే. ఈయన కాంగ్రెస్ - ఎన్సీపీల పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా థానే నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం రోజు ఆయన పుట్టిన రోజు. ప్రతీ పుట్టిన రోజు ఎలా జరుపుకుంటారో ఏమో తెలియదు కానీ ఈసారి బర్త్‌డే మాత్రం కాస్త వెరైటీగా జరుపుకున్నారు. తాను కట్ చేసిన కేక్‌పై తన పేరు కాకుండా దేశ్ కా చౌకీదారి చోర్ హై అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. కేక్‌పై ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ రాతలు రాశారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ పరాంజ్‌పే శివసేన పార్టీ నుంచి కళ్యాణ్ లోక్‌సభ స్థానంలో గెలుపొందారు. 2014లో శివసేనను వీడి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శ్రీకాంత్ షిండేపై ఓటమిపాలయ్యారు. ఇక అయ్యగారిపై 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications