"మోడీ మిమ్మల్ని చంపాలనుకుంటున్నదెవరో చెప్పండి!"
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ రాజ్యసభలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని మోడీ గతంలోప్రకటించారని.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆనందర్ శర్మ కోరారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్బంగా.. ఈ ప్రశ్నను లేవనెత్తారు ఆనంద్ శర్మ.

'మిమ్మల్ని చంపాలని అనుకుంటున్నది ఎవరు? మిమ్మల్ని బెదిరింపులకు లోను చేస్తుందెవరో?' చెప్పాలంటూ ఆనంద్ శర్మ మోడీని కోరారు. ఓవైపు దేశం కోసం అన్ని త్యాగం చేశానని చెబుతూనే.. మరోవైపు ప్రపంచ దేశాలను చుట్టేసి రావడం.. ఏ రకం త్యాగం కిందకు వస్తుందంటూ నిలదీశారు. ప్రధాని ఎక్కువ రోజులు జీవించాలని తామంతా కోరుకుంటున్నామని, అలాంటప్పుడు తనపై బెదిరింపులకు పాల్పడుతుందెవరో వెల్లడిస్తే బాగుంటుందని సున్నితంగా విమర్శించే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications