Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: వహ్ వహ్ రామ్‌జీ: అద్దరిపోయే స్టెప్పులేసిన ముఖేష్ అంబానీ: భార్యతో కలిసి

ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తోన్నాయి. ఒకదాని వెంట ఒకటి శుభ సందర్భాలు వచ్చి పడుతున్నాయి. ఆయన కుమార్తె, ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త ఇషా అంబానీ తల్లి అయ్యారు. కవల పిల్లలను జన్మనిచ్చారు. వారికి ఆదియా, కృష్ణగా నామకరణం చేశారు.

ముఖేష్ అంబానీకి ఇది వరకే మనవడు పుట్టాడు. 2020 డిసెంబర్‌లో కుమారుడు ఆకాశ్ అంబానీ- కోడలు శ్లోకా బాబుకు జన్మనిచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన రెండో కుమారుడు అనిల్ అంబానీ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణ ముంబైలోని కంబన్ హిల్ ప్రాంతంలో ఆయన నివాసం అంటాలియాలో గురువారం రాత్రి వైభవంగా ఈ వేడుకలు పూర్తయ్యాయి.

Anant Ambani and Radhika Merchant Engagement: Ambani family dances at the ring ceremony

రాధికా మర్చంట్ తో ఆయన నిశ్చితార్థం ముగిసింది. గుజరాత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె ఆమె. భరత నాట్య కళాకారిణి కూడా. గత ఏడాదే ఆమె అరంగేట్రం చేశారు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోనున్నట్లు 2019లోనే ఈ రెండు కుటుంబాలు ప్రకటించాయి.

Anant Ambani and Radhika Merchant Engagement: Ambani family dances at the ring ceremony

ఆ తరువాత కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఈ వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాదే అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నిశ్చితార్థ కార్యక్రమాని వైభవంగా నిర్వహించారు. కొద్దిమందికి మాత్రమే ఆహ్వానించారు. ముఖేష్ అంబానీ- వీరేన్ మర్చంట్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇందులో పాల్గొన్నారు. గుజరాతీ సంప్రదాయంలో ఈ కార్యక్రమం ముగిసింది.

ఆంటాలియాలో నిర్వహించిన ఈ నిశ్చితార్థ కార్యక్రమం సందడిగా సాగింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోకా, కూతురు ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమళ్- ఆటపాటలతో కట్టిపడేశారు. హమ్ ఆప్ కే హై కౌన్ సినిమాలోని వహ్ వహ్ రామ్ జీ పాటకు డాన్స్ చేశారు. అద్దిరిపోయే స్టెప్పులేశారు.

Anant Ambani and Radhika Merchant Engagement: Ambani family dances at the ring ceremony

గత ఏడాది ముఖేష్ అంబానీ.. కాబోయే కోడలు రాధికా మర్చంట్ తో కలిసి తిరుమలకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీవారి నిజపాద దర్శన సేవల్లో పాల్గొన్నారాయన. కోటిన్నర రూపాయల డీడీని అప్పట్లో శ్రీవారికి కానుకగా సమర్పించారు. తాను తరచూ శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుంటానని పేర్కొన్నారు.

Anant Ambani and Radhika Merchant Engagement: Ambani family dances at the ring ceremony
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+