అంబానీల ఓల్డ్ లవ్ స్టోరీ- అద్దిరిపోయిన రీక్రియేషన్
Anant Ambani Radhika Merchant wedding: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పండగ వాతావరణ నెలకొంది. రెండో కుమారుడు అనంత్ అంబానీ సంగీత్ వేడుకలు గ్రాండ్‌గా సాగుతున్నాయి. దక్షిణ ముంబైలోని కంబన్ హిల్ ప్రాంతంలో ఆయన నివాసం అంటాలియా, నీతా అంబానీ ముఖేష్ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్.. దీనికి వేదిక అయ్యాయి.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ఈ నెల 12వ తేదీన పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. దీనికోసం ప్రీ-వెడ్డింగ్, సంగీత్ సెలబ్రేషన్స్ ఏర్పాటయ్యాయి. గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక. భరత నాట్య కళాకారిణి కూడా. గత ఏడాదే ఆమె అరంగేట్రం చేశారు.

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోనున్నట్లు 2019లోనే ఈ రెండు కుటుంబాలు ప్రకటించాయి. గత ఏడాది నిశ్చితార్థ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇక పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వివాహానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇప్పటికే ముంబైకి వచ్చారు.
శుక్రవారం రాత్రి కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన వేడుకల్లో పలువురు బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లు పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, హార్దిక్ పాండ్యా, బోనీ కపూర్, జాన్వీ కపూర్.. దీనికి హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోకా, కూతురు ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమళ్- ఆటపాటలతో కట్టిపడేశారు. బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు డాన్స్ చేశారు. అద్దిరిపోయే స్టెప్పులేశారు.

పాత బాలీవుడ్ సినిమాలను తలపించేలా ముంబైని రీక్రియేట్ చేసిన ఓ వీడియోను రిలీజ్ చేశారు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ. తమ మనవళ్లు పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేదతో సందడి చేస్తూ కనిపించారీ వీడియోలో. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications