అనంత్ అంబానీ పాదయాత్ర- పెళ్లి తరువాత?
Anant Ambani Padyatra: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పాదయాత్ర చేపట్టారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుండి ద్వారకాధీష్ ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ తెల్లవారు జామున జామ్‌నగర్‌లోని ఇంటి నుంచి భారీ భద్రత మధ్య పాదయాత్రగా బయలుదేరారు అనంత్ అంబానీ. జామ్‌నగర్ నుంచి ద్వారకా మధ్య ఉన్న దూరం 140 కిలోమీటర్లు పైమాటే. నాలుగు నుంచి అయిదు రోజుల్లో దీన్ని పూర్తి చేయాలని ఆయన సంకల్పించారు. ఆదివారం నాటికి ద్వారకా ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది.

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రియుడు, అనంత్ అంబానీ ఆప్తమిత్రుడు శిఖర్ పహారియా కూడా ఈ పాదయాత్రలో కనిపించారు. ఈ నెల 10వ తేదీన ఆయన పుట్టినరోజు. 30వ పడిలో అడుగుపెట్టనున్నారు. తన 30వ పుట్టినరోజును పురస్కరించుకుని ద్వారకాలో శ్రీకృష్ణపరమాత్ముడిని దర్శించుకోవాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో జామ్‌నగర్‌లోని మోతీ ఖావ్డీ నివాసం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. అనంత్ అంబానీ వివాహం జరిగిన తరువాత జరుపుకోనున్న మొట్టమొదటి బర్త్‌డే కూడా ఇదే. అందుకే- పాదయాత్రగా ద్వారకా వెళ్లాలని నిర్ణయించుకున్నారని, ఈ తెల్లవారు జామున దీన్ని ప్రారంభించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రోజూ10 నుంచి 12 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తారని అన్నారు.
జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్రకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జామ్ నగర్ నుంచి ద్వారకా వరకు స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్‌ను కల్పించనున్నారు. రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్, వంతారా వైల్డ్ యానిమల్స్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉద్యోగులు ఆయన వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications