చరిత్రలో నరరూప రాక్షసుడు, రేపిస్టుగా గుర్తింపు: అతని పూజకు ఆహ్వానించవద్దు: కేంద్ర మంత్రి !

నరరూప రాక్షసుడు, రేపిస్టు, క్రూరుడు అని చరిత్రలో పేరు ఉందిఅలాంటి వ్యక్తి పూజలకు నన్ను ఆహ్వానించకూడదు, ప్రభుత్వానికి లేఖ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ఫేస్ బుక్ లో సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు: నరహంతకుడు, రేప్ లు చేశాడు, క్రూరుడు అని చరిత్రలో పేరు తెచ్చుకున్న వ్యక్తి కోసం నిర్వహిస్తున్న పూజకు దయచేసి నన్ను ఆహ్వానించకూడదని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ఆయన ఫేస్ బుక్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ఫేస్ బుక్ లో ఈ వ్యాఖ్యలు చూసిన అనేక మంది ఆయనకు మద్దతు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంద్రి కేంద్ర మంత్రి తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. టిప్పుసుల్తాన్ పేరు ప్రస్తావించకుండా కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ఈ వ్యాఖ్యలు చేశారు.

Anantkumar Hegde displeasure towards the celebration glorification Tippu Jayanti

టిప్పసుల్తాన్ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి తనను ఆహ్వానించకూడదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అక్టోబర్ 14వ తేదిన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే లేఖ రాశారు. గత సంవత్సరం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించరాదని కర్ణాటక ప్రభుత్వ అధికారులకు లేఖ రాశారు.

గత సంవత్సరం కర్ణాటకలోని శిరసి ప్రాంతంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆ సందర్బంలో కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే షర్టు విప్పి అర్దనగ్నంగా నిరసన వ్యక్తం చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపిట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+