రూ. 100 కోట్ల స్కామ్.. మాజీ విద్యాశాఖ మంత్రి అరెస్ట్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే సీనియర్ నేత, మాజీ విద్యాశాఖ మంత్రి అన్ బిల్ మహేష్ పొయ్యమోజీ అరెస్ట్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించి రూ. 100 కోట్ల స్కామ్ లో అతన్ని అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. మద్రాస్ హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను రద్దు చేసిన వెంటనే ది గ్రేటర్ చెన్నై పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అర్హత లేని ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు, చట్టపరమైన క్లియరెన్స్ లు ఇవ్వటంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇలా ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించి రూ. 100 కోట్ల మేర నగదు లావాదేవీలు జరిగినట్లు సమాచారం అందుతోంది.

గత డీఎంకే ప్రభుత్వంలో మహేశ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2021 నుంచి 2026 వరకు ఆయన పదవీకాలంలో కొనసాగారు. ఆ సమయంలో దాదాపు 1000 కు పైగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుంచి ఆయన పార్టీ ఫండ్ పేరిట అక్రమంగా నగదును వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. దానికి బదులుగా ఏమాత్రం సౌకర్యాలు, అర్హత లేని ప్రైవేట్ స్కూల్స్ కు ఆయన పర్మిషన్, ప్రభుత్వ గుర్తింపు ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ కూడా కేసును నమోదు చేసింది.

ప్రైవేట్ స్కూల్స్ ఫ్రాడ్ కేసులో భాగంగా గత నెలలో మహేష్ ను పోలీసులు విచారించారు. ఈ స్కామ్ లో భాగస్వామ్యం అయిన ఇతర బడా నేతలు, అధికారుల వివరాలను రాబట్టేందుకు పోలీసులు రోజంతా పలు ప్రశ్నలు సంధించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో జరిపిన బ్యాంకు లావాదేవీలను, పార్టీ ఫండ్స్ కు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఈ ప్రశ్నలకు సంబంధించి మాజీ మంత్రి మహేష్ ఇచ్చిన వివరాలను రికార్డ్ చేశారు. అంతకుముందు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు అందింది. ప్రైవేట్ స్కూల్స్ కు శాశ్వత గుర్తింపు కోసం కోట్ల రూపాయలను వసూలు చేశారన్న ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు.

AnbilMahesh Former DMK minister arrested latest in connection with a 100 crore private school scam

ఈ క్రమంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తొలుత ఈ కేసుతో సంబంధం ఉన్న బీటీ అరస కుమార్, సురేశ్, రాజా అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 16 న మాజీ విద్యాశాఖ మంత్రి అన్ బిల్ మహేష్ పొయ్యమోజీకి చెందిన 9 కీలక స్థావరాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు పత్రాలు, ప్రాపర్టీ డీడ్స్, బ్యాంకు డాక్యూమెంట్స్ , డిజిటల్ డివైజ్ లను సీజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+