Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భార్య హత్యకు మాస్టర్ ప్లాన్, వీడు చంపినట్లు ఇంత వరకు ఎవ్వరూ, నాగుపాములు, పగ పట్టిన పెళ్లామ్ !

కొచ్చి/ కోల్లాం/ చెన్నై: భార్యతో కాపురం చేస్తున్న భర్త చెడు ఆలోచనలో పడ్డాడు. తన భార్యను చంపేస్తే ఆమె బంగారు నగలు, డబ్బు, ఆస్తీ మొత్తం తనకు వస్తుందని ఆశపడ్డాడు. పోలీసు కేసు అయితే డబ్బు, నగలు వచ్చినా తాను అనుభవించలేనని, పోలీసు కేసు నుంచి తప్పించుకోవాలని ఆలోచించాడు. భార్యును చంపేసి ఎలా తప్పించుకోవాలి అంటూ యూట్యూబ్ లో వెతికేశాడు. భార్య దగ్గర ఇప్పటికే భారీ మొత్తంలో నగలు, డబ్బు ఉండటంతో అతను వాటిని నొక్కేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే శాస్త్రీయంగా భార్య చనిపోతే కేసు నుంచి తప్పించుకోవచ్చని కిలాడీ భర్త ప్లాన్ వేశాడు. యూట్యూబ్ లో చూసిన ఓ స్కెచ్ ప్రకారం భార్యను చంపాలని ప్రయత్నించాడు. అడవిలో విషపూరితమైన నాగుపాములు, కోబ్రా పాములు పట్టేవాడిని సంప్రధించాడు. పాము కాటే వేస్తే కచ్చితంగా మనిషి చనిపోయే కోబ్రా పాములు రెండు కొనుగోలు చేశాడు. పాము కాటు వేసిన తరువాత శరీరంలోకి ఎంతసేటికి విషయం ఎక్కుతుంది. చికిత్స అందకుండానే ఎంతసేపటిలో మనిషి చనిపోతాడు అని కేటుగాడు అనేక ప్రయోగాలు చేశాడు. పక్కాప్లాన్ తో భార్య ఉంటున్న గదిలోకి రెండు పాముల తల మీద కర్రతో దాడి చేసి అవి పగతో రగిలిపోయేలా చేసి వాటిని వదిలేసిన భర్త ఆ పాములు ఆమెను కాటు వేసి చంపేవరకు వేచి చూశాడు. తరువాత పాములు కరిచి తన భార్య చనిపోయిందని అందరినీ నమ్మించడానికి ప్రయత్నించాడు. నాగుపాము పగపట్టిందో లేదో కాని పైలోకాల్లో ఉన్న భార్య మాత్రం ఆమె భర్త మీద పగపట్టింది. భర్తను పోలీసులకు పట్టించే వరకు అతని భార్య ఆత్మ అక్కడక్కడే తిరగంతో కేటుగాడితో పాటు అతని కుటుంబ సభ్యులు అందరికి సినిమా కపడింది. ఇంత వరకు భార్యను ఎవ్వరు చంపని స్కెచ్ తో చంపేసిన కేటుగాడి స్కెచ్ లు తెలుసుకున్న పోలీసు అధికారుల దిమ్మతిరిగిపోయింది.

భార్యతో కాపురం

భార్యతో కాపురం

కేరళలోని కొల్లాం జిల్లా ఎరతు వెల్లస్సేరి ప్రాంతంలో అంచల్ ఉత్రా అలియాస్ ఉత్రా (25) అనే యువతి నివాసం ఉంటున్నది. ఉత్రాను ఆమె కుటుంబ సభ్యులు సూరజ్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. వివాహం సమయంలో ఉత్రా కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బు కట్నం కింద సూరజ్ కు ఇచ్చారు. భార్య ఉత్రాతో కాపురం చేస్తున్న భర్త సూరజ్ చెడు ఆలోచనలో పడ్డాడు.

భార్యను ఎలా చంపాలని యూట్యూబ్ లో వెతికేశాడు

భార్యను ఎలా చంపాలని యూట్యూబ్ లో వెతికేశాడు

తన భార్య ఉత్రాను చంపేస్తే ఆమె బంగారు నగలు, డబ్బు, ఆస్తీ మొత్తం తనకు వస్తుందని ఆమె భర్త సూరజ్ ఆశపడ్డాడు. పోలీసు కేసు అయితే డబ్బు, నగలు నా చేతికి వచ్చినా తాను అనుభవించలేనని, పోలీసు కేసు నుంచి తప్పించుకోవాలని సూరజ్ ఆలోచించాడు. భార్య ఉత్రాను చంపేసి ఎలా తప్పించుకోవాలి అంటూ సూరజ్ చాలా కాలం నుంచి యూట్యూబ్ లో వెతికేశాడు.

 భార్య హత్యకు అనేక ప్లాన్ లు

భార్య హత్యకు అనేక ప్లాన్ లు


భార్య ఉత్రా దగ్గర ఇప్పటికే భారీ మొత్తంలో నగలు, డబ్బు ఉండటంతో అతను వాటిని నొక్కేయాలని సూరజ్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే శాస్త్రీయంగా భార్య ఉత్రా చనిపోతే కేసు నుంచి తప్పించుకోవచ్చని కిలాడీ భర్త సూరజ్ ప్లాన్ వేశాడు. విదేశీయులు చేతికి మట్టి అంటకుండా మనుషులను ఎలా చంపుతారు అంటూ యూట్యూబ్ లో చూసిన ఓ స్కెచ్ ప్రకారం భార్య ఉత్రాను చంపాలని సూరజ్ ప్రయత్నించాడు.

అడవిలో పాములు పట్టేవాడి కోసం వేట

అడవిలో పాములు పట్టేవాడి కోసం వేట

అడవిలో విషపూరితమైన నాగుపాములు, కోబ్రా పాములు పట్టేవాడు సురేష్ ను సూరజ్ సంప్రధించాడు. పాము కాటే వేస్తే కచ్చితంగా మనిషి చనిపోయే రెండు కోబ్రా పాములను సురేష్ నుంచి కొనుగోలు చెయ్యడానికి అతనికి రూ. 10 వేలు ఇచ్చాడు. పాము కాటు వేసిన తరువాత శరీరంలోకి ఎంతసేటికి విషయం ఎక్కుతుంది. చికిత్స అందకుండానే ఎంతసేపటిలో మనిషి చనిపోతాడు అంటూ సూరజ్ అనేక ప్రయోగాలు చేశాడు. శరీరం అంతా విషం ఉండే రెండు కోబ్రా పాములను పాములు పట్టే సురేష్ తీసుకెళ్లి సూరజ్ కు ఇచ్చాడు.

భార్యను పక్కా ప్లాన్ తో చంపేశాడు

భార్యను పక్కా ప్లాన్ తో చంపేశాడు


2021 మే 6వ తేదీన సూరజ్ భార్య ఉత్రా మేడ మీద ఆమె గదిలో ఉంది. ఆ సమయంలో భర్త సూరజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అదే ఇంటిలో కింది అంతస్తులో ఉన్నారు. భార్య ఉత్రా ఉంటున్న గదిలో రెండు కోబ్రా పాములు వదిలేసిన సూరజ్ ఆ ఇంటి తలుపులు, కిటికీలు మూసేశాడు. పాములు ఉత్రాను కాటు వేశాయి. తరువాత తన భార్య ఉత్రాను నాగుపాములు కరిచాయని నానా హంగామా చేసిన సూరజ్ చట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. నిజంగానే ఉత్రా ఉంటున్న రూమ్ లో నాగుపాములు ఉండటంతో స్థానికులు హడలిపోయారు. నాగుపాములు కరవడంతో ఉత్రా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 భర్త తీరుతో అనుమానం..... అక్కడే అసలు కథ మొదలైయ్యింది

భర్త తీరుతో అనుమానం..... అక్కడే అసలు కథ మొదలైయ్యింది

భార్య ఉత్రాను నాగుపాములు కరిచి ఆమె చనిపోవడంతో సూరజ్ కు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఉత్రా శరీరానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఉత్రా పోస్టుమార్టుం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు పరిశీలించారు. సర్వసాధారంగా పాములు కాటు వేస్తే ఆ తీరే వేరని, పాములకు ట్రైనింగ్ ఇచ్చి కాటు వేయిస్తే ఆ తీరే వేరని పోలీసులు, అటవి శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది. రంగంలోకి అటవి శాఖ అధికారులు, పాములకు ట్రైనింగ్ ఇచ్చే నిపుణులను రంగంలోకి దింపారు. పాములకు ట్రైనింగ్ ఇచ్చి ఉత్రాను కావాలని వాటితో చంపించారని కోల్లాం రూరల్ ఎస్పీ హరిశంకర్ అన్నారు.

మొగుడి స్కెచ్ తో మైండ్ బ్లాక్

మొగుడి స్కెచ్ తో మైండ్ బ్లాక్


పోలీసుల విచారణలో ఉత్రాను ఆమె భర్త సూరజ్ హత్య చేయించాడని వెలుగు చూసింది. భార్య ఉత్రాను చంపడానికి సూరజ్ రెండు నాగుపాములను బాటిల్ లో తీసుకెళ్లాడని, పాములను గదిలో వదిలే సమయంలో కర్ర తీసుకుని పాముల తల మీద బలంగా కొట్టాడని, కోపంగా వెళ్లిన పాములు బెడ్ మీద నిద్రపోతున్న అతని భార్య ఉత్రాను కాటు వేశాయని కేసు విచారణలో భాగంగా ఉన్న అటవి శాఖ అధికారి, కోల్లాం రేంజర్ బిఆర్. జయన్ అంటున్నారు. భార్య ఉత్రాను పాములతో చంపించిన భర్త సూరజ్ తరువాత ఆమె శరీరం మీద ఉన్న బంగారు నగలు తీసుకెళ్లి ఇంటి ఆవరణంలో పాతిపెట్టాడని పోలీసులు గుర్తించారు.

ఫ్యామిలీ మొత్తం సపోర్టు

ఫ్యామిలీ మొత్తం సపోర్టు

సూరజ్ అతని భార్య ఉత్రాను హత్య చెయ్యడానికి పాములును ఉపయోగించడం, హత్య తరువాత సాక్షాలు నాశనం చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు అందరూ సహకరించారని పోలీసు అధికారి హరి శంకర్ అంటున్నారు. ఇప్పటికే సూరజ్ తండ్రి సురేంద్రన్, తల్లి రేణుక, అతని సోదరి సూర్యాలను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్రాను హత్య చేసిన తరువాత సాక్షాలు మొత్తం నాశనం చెయ్యడానికి సూరజ్ కు అతని తల్లి రేణు, సోదరి సూర్యా, తండ్రి సురేంద్రన్ సహకరించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 200 మంది సాక్షులు, 250 ఫోన్ కాల్స్ 2 వేల పేజీల చార్జ్ షీటు

200 మంది సాక్షులు, 250 ఫోన్ కాల్స్ 2 వేల పేజీల చార్జ్ షీటు


తన భార్య ఉత్రాను తానే పాములతో కాటు వేయించి చంపించానని సూరజ్ బహిరంగంగా మీడియా ముందు అంగీకరించాడు. ఈ కేసులో సూరజ్ తండ్రికి బెయిల్ మంజూరు అయ్యింది. నగలు, డబ్బు ఆశ కోసం సూరజ్ అతని భార్యను ఇంత పక్కాప్లాన్ తో హత్య చెయ్యడంతో కొల్లాం పోలీసులు విదేశీ నిపుణులు, అటవి శాఖ, ఫోరెన్సిక్ నిపుణులు, పాములకు ట్రైనింగ్ ఇచ్చే వారి సహకారాన్ని పోలీసు అధికారులు తీసుకున్నారు. ఇప్పటికే 200 మంది సాక్షులను విచారణ చేసి 250 ఫోన్ కాల్స్ పరిశీలించిన కోల్లాం పోలీసులు సుమారు 2,000 పేజీల చార్జ్ షీటును కోర్టులో సమర్పించారు.

Recommended Video

    Revant Reddy has strongly criticized Ktr for illegally entering funds into Mrs. Shailima's account
    ఇండియాలో వీడే ఫస్ట్ టైమ్ అనుకుంటాము ?

    ఇండియాలో వీడే ఫస్ట్ టైమ్ అనుకుంటాము ?

    సూరజ్ అతని భార్య ఉత్రాను హత్య చేసినట్లు ఇంత వరకు భారతదేశంలో ఇంత పక్కాప్లాన్ గా భార్యను ఎవ్వరూ హత్య చేసి ఉండరని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి భర్తకు ఉత్రా విడాకులు ఇచ్చిన తరువాత ఆమె దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బు ఉందని ఆశతో ఆమెను సూరజ్ వివాహం చేసుకున్నాడని తెలిసింది. భారతదేశంలో ఇప్పుడు ఉత్రా హత్య కేసు హాట్ టాపిక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+