పెళ్ళికాలేదని హోటల్‌లో రూమ్‌ ఇచ్చేందుకు నిరాకరణ

ముంబై: పెళ్ళి కాని జంటలకు హోటల్ గది ఇచ్చేందుకు ముంబైలోని ఓ హోటల్ నిరాకరించింది. ఆన్‌లైన్‌లో నెల రోజుల క్రితం బుక్ చేసుకొన్న హోటల్ అద్దెను ఆ జంటకు హోటల్ యాజమాన్యం తిరిగి చెల్లించింది. పెళ్ళి కాని వారికి హోటల్ గదులు ఇవ్వమని ఆ హోటల్ యాజమాన్యం తేల్చి చెప్పింది.

పెళ్లి కాని జంటకు హోటల్ లో గది ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల మహిళ అమెరికాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ (31) యూకే కళాశాలలో పీజీ చదువుతున్నారు. ప్రేయసీ ప్రియుల జంట సెలవుల్లో భాగంగా భారతదేశంలో పర్యటించేందుకు ముంబై నగరానికి వచ్చారు.

ముంబై నగరంలోని అంధేరీ వెస్ట్ లో ఉన్న ఫ్యాబ్ హోటల్ పంచవటిలో బస చేసేందుకు వచ్చారు. పెళ్లి కాని జంటకు తాము హోటల్ లో గది ఇచ్చేది లేదని హోటల్ సిబ్బంది తేల్చి చెప్పారు.

Andheri hotel denies an unmarried couple room

నెలక్రితం మహిళ పంచవటి హోటల్ లో గది బుక్ చేసినప్పటికీ పెళ్లికాని జంటలకు తాము గది ఇవ్వమని చెప్పడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఢిల్లీ, జైపూర్, ఉదయ్ పూర్ నగరాల్లో పర్యటించామని అక్కడి హోటళ్లలో గదులిచ్చారని వారు చెప్పారు.

కాని ముంబైలో మాత్రం తమకు పెళ్లి కాలేదని గది ఇవ్వకుండా నిరాకరించడం ఏమిటని ఆ జంట ప్రశ్నించింది.తాము పెళ్లి కాని జంటలకు హోటల్ లో గదులు ఇవ్వమని, ఇది తమ విధాన నిర్ణయమని ఫ్యాబ్ హోటల్ ప్రతినిధి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+