Andhra Girl: ప్రియుడి కోసం గంజాయి వ్యాపారం, ఇంజనీరింగ్ చదవి ఐటీ హబ్ లో అమ్మాయి ? !
బెంగళూరు: ప్రేమ ఎంత మధురం అన్నాడు ఓ మహాకవి. ప్రేమించిన వ్యక్తి హ్యాండ్ ఇస్తే అదే ప్రేమ యమపాశం అని చెప్పాడు మరో మేధావి. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు కావాలసిన ఓ అమ్మాయి ప్రియుడి కోసం ఇప్పుడు జైలుపాలైయ్యింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవపడి వచ్చిన ప్రియురాలి దగ్గర ప్రియుడు గంజాయి వ్యాపారం చేయించాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ హబ్ చేరుకుని ప్రియుడితో సంతోషంగా కాపురం చెయ్యాలని బావించిన ప్రియురాలు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు వేసిన స్కెచ్ లో చిక్కుకున్న ప్రియురాలికి ఇప్పుడు బెయిల్ ఇచ్చే వ్యక్తులే కరువయ్యారు.

ఇంజనీరింగ్ అమ్మాయి
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రేణుకా అనే యువతి, సిద్దార్థ అనే యువకుడు చెన్నైలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేశారు. ఇంజనీరింగ్ చదివే సమయంలో సిద్దార్థ, రేణుకాకు కాలేజ్ లో పరిచయం అయ్యింది. సిద్దార్థ, రేణుకా పరిచయం ప్రేమకు దారితీసి ఇద్దరూ చెన్నైలో కలిసితిరిగారు. చదువు పూర్తి అయిన తరువాత సిద్దార్థ బెంగళూరుకు. రేణుకా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోయారు.

సిద్దార్థ అంటే నాకు ప్రాణం: రేణుకా
తాను సిద్దార్థను వివాహం చేసుకుంటానని రేణుకా ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. సిద్దార్థ గురించి వివరాలు తెలుసుకున్న రేణుకా కుటుంబ సభ్యులు వారి పెళ్లిని వ్యతిరేకించారు. సిద్దార్థకు చెడుసావాసాలు ఎక్కువ ఉన్నాయని, అతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుందని రేణుకాకు బుద్దిమాటలు చెప్పారు. అయితే ప్రియుడి మోజులో రేణుకా తల్లిదండ్రులను, వారి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు.

నీచావు నువ్వు చావు
నేను చచ్చినా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోనని, సిద్దార్థను పెళ్లి చేసుకుంటానని రేణుకా ఇంట్లో తేల్చి చెప్పింది. నీ చావు నువ్వు చావు అంటూ రేణుకాకు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంట్లో గొడవపడిన రేణుకా ప్రియుడు సిద్దార్థ నివాసం ఉంటున్న ఐటీ హబ్ బెంగళూరుకు వచ్చేసింది. ప్రియురాలు రేణుకాతో సిద్దార్థం కొంతకాలం నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు.

వ్యాపారం చేసి జీవితంలో సెటిల్ అయిపోదాం
పెళ్లి చేసుకోకుండా మనం ఇలా ఎంతకాలం ఎంజాయ్ చేద్దామని, హ్యాపీగా పెళ్లి చేసుకుందామని రేణుకా ప్రియుడు సిద్దార్థ మీద ఒత్తిడి చేసింది. మనం మంచి వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాధించి జీవితంలో సెటిల్ అయిపోదామని, తరువాత పెళ్లి చేసుకుందామని సిద్దార్థ చెప్పాడు. వ్యాపారం చెయ్యడానికి రేణుకా ఓకే చెప్పింది. అంతే ప్రియుడు సిద్దార్థ అంతకు ముందే చేస్తున్న గంజాయి వ్యాపారం విషయం తెరమీదకు తెచ్చాడు.

ప్రియుడి కోసం ఏంతవరకైనా ఓకే
గంజాయి వ్యాపారం చెయ్యడం నేరం అనే విషయం రేణుకాకు ముందే తెలుసు. అయితే ప్రియుడి మోజులో పడిపోయిన రేణుకా గంజాయి వ్యాపారం చెయ్యడానికి సిద్దం అయ్యింది. బెంగళూరులోని సదాశివనగర్ లో మెయిన్ రోడ్డు పక్కనే రూమ్ తీసుకుని గంజాయ్ వ్యాపారం చెయ్యడం మొదలుపెట్టారు. పోలీసులు వస్తే తాను చిక్కకూడదని సిద్దార్థ గంజాయి డెలివరీ ఇవ్వడానికి ప్రియురాలు రేణుకాను కస్టమర్ల దగ్గరకు పంపిస్తూ వచ్చాడు.

టెక్కీ కావాల్సిన రేణుకా నేడు స్మగ్లర్
గంజాయి డిలివరీ ఇవ్వడానికి బయటకు వచ్చిన రేణుకాను సదాశివనగర్ పోలీసులు పట్టుకున్నారు. తనకు ఏమీ తెలీదని, తన ప్రియుడు సిద్దార్థ చెప్పిన పని చేస్తున్నానని రేణుకా మొత్తుకున్నా పోలీసులు మాత్రం వినలేదు. రేణుకాను అరెస్టు చేసిన పోలీసులు ఆమె నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Recommended Video

ఆంధ్రా అమ్మాయికి బెయిల్ ఇచ్చేవాళ్లు లేరు
కస్టమర్లకు అడ్రస్ సులభంగా తెలియాలని ఓ ప్రముఖ హోటల్ పక్కనే మెయిన్ రోడ్డులో రూమ్ తీసుకోవడంతో వీళ్లు సులభంగా పోలీసులకు చిక్కిపోయారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రం చేరుకుని ప్రియుడు సిద్దార్థతో సంతోషంగా కాపురం చెయ్యాలని బావించిన ప్రియురాలు రేణుకా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు సిద్దార్థ వేసిన స్కెచ్ లో చిక్కుకున్న ప్రియురాలు రేణుకాకు ఇప్పుడు బెయిల్ ఇచ్చే వ్యక్తులే కరువయ్యారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications