చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో చైల్డ్ పోర్న్ ఇమేజెస్‌: తమిళనాడులో తిరుపతి వ్యక్తి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: చైల్డ్ పోర్న్ ఇమేజెస్‌తో పేజీలు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని డిప్లమా చేసిన యాదవ మణికంఠగా గుర్తించారు. అతను తిరుపతిలో సరుకుల దుకాణం నడుపుతున్నాడు.

వాస్తవంగా అతను తమిళనాడుకు చెందినవాడు. ఆ ఫేస్‌బుక్ పేజీలకు అతను అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నాడని, అతను ఫేస్‌బుక్కులో గత కొన్ని నెలలుగా మూడు అశ్లీల కమ్యూనిటీ పేజీలను నిర్వహిస్తున్నాడని, సాంకేతిక సమస్యల వల్ల రెండు కమ్యూనిటీ పేజీలు పని చేయడం లేదని, ఒక్కటి మాత్రమే పనిచేస్తోందని పోలీసులు తెలిపారు.

Andhra Pradesh man held for hosting Facebook child porn page

ఆ కమ్యూనిటీ పేజీలకు సంబంధించిన మిగతా వ్యక్తులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అశ్లీలమైన చిత్రాలను పోస్టు చేయడమే కాకుండా వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలు పెడుతున్నారని వారు చెప్పారు

నిందితుడికి చెందిన మొబైల్ ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశ్లీల పేజీలు ఉన్నాయని గుర్తించిన తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ పేజీలతో తమిళనాడులో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. యువ బాలికల అశ్లీల చిత్రాలను ఎన్నింటినో వాటిలో పోస్టు చేశారని వారు చెప్పారు. ఆ చిత్రాల్లో కొన్నింటిని మణికంఠనే తీసినట్లు తెలుస్తోందని అంటున్నారు.

English summary
A 27-year-old man, from Tirupati in Andhra Pradesh, was on Sunday arrested by cyber crime sleuths from Tamil Nadu police for creating pages on Facebook filled with child porn images.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X