వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ చెల్లింపులు:టాప్ ఐదు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు, భీమ్ యాప్ కు రెఫరల్ ఆఫర్

నగదు రహిత చెల్లింపుల్లో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో చోటును దక్కించుకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల తర్వాతే ఢిల్లీ నిలిచింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:నగదు రహిత చెల్లింపుల్లో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో చోటును దక్కించుకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల తర్వాతే ఢిల్లీ నిలిచింది. అయితే భీమ్ యాప్ కు రెఫరల్ ఆఫర్ ను ఏర్పాటు చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం నగదురహిత చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను కేంద్రం ప్రోత్సాహకాలను ,ప్రకటించింది.

గత ఏడాది పెద్ద నగదునోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పెద్ద నగదునోట్లను రద్దుచేయడంతో నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకొంది.

నగదు రహిత లావాదేవీల ప్రోత్సహం కోసం కేంద్రం పలు పథకాలను కూడ తీసుకొచ్చింది. వ్యాపారుల కోసం ప్రజల కోసం వేర్వేరుగా పథకాలను తెచ్చింది.

నగదు రహిత లావాదేవీల్లో టాప్ లో తెలుగు రాష్ట్రాలు

నగదు రహిత లావాదేవీల్లో టాప్ లో తెలుగు రాష్ట్రాలు

నగదు రహిత లావాదేవీల్లో అగ్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. మొదటి ఐదు స్థానాల్లోనే రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి.ఈ రెండు రాష్ట్రాల తర్వాతే ఢిల్లీ నిలిచింది. నగదు రహిత లావాదేవీల్లో ప్రథమస్థానంలో మహరాష్ట్ర నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు నిలిచింది. తమిళనాడు తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నిలిచింది.ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల తర్వాతి స్థానాన్ని ఢిల్లీ సాధించిందన్నారాయన.

బీమ్ యాప్ కు రెఫరల్ ఆఫర్

బీమ్ యాప్ కు రెఫరల్ ఆఫర్

అతి తక్కువ కాలంలోనే భీమ్ యాప్ రికార్డులను సృష్టించింది. నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం భీమ్ యాప్ ను తీసుకు వచ్చింది. ఈ యాప్ ను తొలుత ఆండ్రాయిడ్ ఫోన్లకే పరిమితం చేసినా...మార్పులు చేర్పులు చేసి అన్ని రకాల ఫోన్ వినియోగదారులకు కూడ ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చారు.భీమ్ యాప్ మరింత ప్రచారం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. యాప్ లో వినియోగదారులకు రెఫరల్ ఆఫర్ ను ,వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.ఎండిఆర్ చార్జీలను తగ్గించడంతో పాటు యూపిఐ భీమ్ యాప్ కు మరింత ప్రచారాన్ని తేవాలని సర్కార్ భావిస్తోంది.

డిజిటల్ లావాదేవీలు పెరిగితే ఎండీఆర్ చార్జీలు తగ్గుతాయి

డిజిటల్ లావాదేవీలు పెరిగితే ఎండీఆర్ చార్జీలు తగ్గుతాయి

డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరిగితే ఎండీఆర్ ఛార్జీలు తగ్గుతాయని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు.ఎండీఆర్ ఛార్జీలను ఏప్రిల్ ఒ:కటవ తేది నుండి బాగా తగ్గించాలని ఆర్ బి ఐ ఓ సర్క్యులర్ ను ఆదేశించింది.ఈ అంశాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు అమితాబ్ కాంత్ చెప్పారు.కొన్ని సవాళ్ళను అధిగమిస్తేనే ఎండీఆర్ ఛార్జీలను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు.

నగదు రహిత లావాదేవీల్లో 9.8 లక్షల మందికి లబ్ది

నగదు రహిత లావాదేవీల్లో 9.8 లక్షల మందికి లబ్ది

నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ప్రోత్సహాకాలను కేంద్రం ఇస్తోంది. నగదురహిత లావాదేవీలు చేసిన వారికి ప్రత్యేకంగా నిధులను కేటాయించింది కేంద్రం. రెండు వేల రూపాయాల లోపు లావాదేవీలను డిజిటల్ పేమెంట్ చేస్తే 0.75 శాతం, అంతకు మించితే 1 శాతం ఎండీఆర్ ఛార్జీలున్నాయి. మరో వైపు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకకు వీలుగా లక్కీ పథకాల్లో ఇప్పటికే 9.2 లక్షల మంది లబ్దిపొందారు.

English summary
andhra pradesh and telangana states in top five places for digital payments said niti aayog ceo amitabh kant.we will introduce referal offer for bhim app he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X