Andhra: ఎమ్మెస్సీ అమ్మాయి, కంపెనీ ముందే ప్రియురాలిని 16 సార్లు కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు !
ఆంధ్రా ప్రియురాలి ఆఫీసు దగ్గరకు వెళ్లిన ప్రియుడు నీతో నేను మాట్లాడాలని చెప్పి నిమిషంలోనే జోబులోని కత్తి బయటకు తీసి అతని ప్రియురాలిని 16 సార్లు కసితీరా పొడిచి చంపేశాడు.
బెంగళూరు/తిరుపతి: యువతి ఎమ్మెస్సీ పూర్తి చేసింది. బాగా చదువుకున్న అమ్మాయికి ప్రముఖ మెడిసన్ కపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ల్యాబ్ లో పని చేస్తున్న యువకుడితో ఆయువతికి పరిచయం అయ్యింది. ఐదు సంవత్సరాలు ప్రేమికులు చాలా హ్యాపీగా తిరిగారు. ప్రేమికులు ఇద్దరు పొరుగు రాష్ట్రంలో నివాసం ఉండటంతో ప్రతిరోజు కలుసుకుని సంతోషంగా కలసిమెలసి ఉండేవారని తెలిసింది. ఉద్యోగం చేస్తున్న కంపెనీలో పని పూర్తి చేసుకున్న ప్రియురాలు బయటకు వచ్చింది. ప్రియురాలి ఆఫీసు దగ్గరకు వెళ్లిన ప్రియుడు నీతో నేను మాట్లాడాలని చెప్పాడు. తరువాత నిమిషం కూడా పూర్తి కాకుండానే జోబులో ఉన్న కత్తి బయటకు తీసిన ప్రియుడు అతని ప్రియురాలిని 16 సార్లు కసితీరా పొడిచి దారుణంగా హత్య చెయ్యడం కలకలకం రేపింది.

మంచి ఉద్యోగం చేస్తున్న యువతి
ఆంధ్రప్రదేశ్ కు చెందిన లీలా పవితా అలియాస్ లీలా (26) అనే యువతి ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన లీలా పవిత్రా బెంగళూరు చేరుకుని ఇక్కడి మురగేశ్ పాళ్యలోని ఓమెగా మెడిసిన్ కంపెనీలో ల్యాబ్ లో ఉద్యోగం చేస్తున్నది. మంచి ఉద్యోగం చేస్తున్న లీలా పవిత్రా నిత్యం ఆమె కుటుంబ సభ్యులతో టచ్ లో ఉంది.

బెంగళూరులో లవర్స్
ఆంధ్రప్రదేశ్ కు చెందిన దినకర్ (28) అనే యువకుడు బెంగళూరు చేరుకుని దొమ్మలూరులోని ల్యాబ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల నుంచి లీలా పవిత్రా, దినకర్ ప్రేమించుకుంటున్నారు. ఐదు సంవత్సరాలు ప్రేమికులు లీలా పవిత్రా, దినకర్ చాలా హ్యాపీగా తిరిగారు. ప్రేమికులు దినకర్, లీలా పవిత్రా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న కర్ణాటకలోని బెంగళూరులో నివాసం ఉండటంతో ప్రతిరోజు కలుసుకుని సంతోషంగా తిరిగారని తెలిసింది.

పెళ్లికి మాత్రం ?
దినకర్, లీలా పవిత్రా వారి ప్రేమ విషయం వాళ్లవాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు. లీలా పవిత్రా, దినకర్ కులాలు వేరు కావడంతో వారు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని లీలా పవిత్రా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు దినకర్, లీలా పవిత్రా అనేక ప్రయత్నాలు చేశారని తెలిసింది. దినకర్ తో పెళ్లికి తాము అంగీకరించమని లీలా పవిత్రా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారని తెలిసింది.

ప్రియుడిని దూరం పెట్టిన పవిత్రా
దినకర్ తో ఇక ముందు నువ్వు మాట్లాడకూడదని లీలా పవిత్రాకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం నుంచి లీలా పవిత్రా ఆమె ప్రియుడు దినకర్ ను దూరం పెట్టి అతన్ని కలవడం మానేసింది. ప్రియురాలికి దగ్గర కావాలని దినకర్ చాలా ప్రయత్నాలు చేశాడని తెలిసింది. అయితే లీలా పవిత్రా మాత్రం మాజీ ప్రియుడు దినకర్ ను కలవకూడదని డిసైడ్ అయ్యింది.

కంపెనీ ముందే చంపేసిన ప్రియుడు
మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో దినకర్ అతని ప్రియురాలు లీలా పవిత్రా ఉద్యోగం చేస్తున్న మురగేశ్ పాళ్యలోని కంపెనీ దగ్గరకు వెళ్లాడు. రాత్రి పని ముగించుకుని లీలా పవిత్రా కంపెనీలో నుంచి బయటకు వచ్చింది. నీతో మాట్లాడాలని దినకర్ చెప్పడంతో లీలా పవిత్రా కొంచెం పక్కకు వచ్చింది. ఆ సందర్బంలో జోబులో ఉన్న కత్తి తీసుకున్న దినకర్ మొదట లీలా పవిత్రా కడుపులో పదేపదే పొడిచాడు. లీలా పవిత్రా కేకలు వెయ్యడంతో ఇంకా రగిలిపోయిన దినకర్ ఆమె ఛాతీ ముఖం, గొంతు తదితర చోట్ల ఇష్టం వచ్చిన 16 సార్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన లీలా పవిత్రా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ప్రియుడిని పట్టుకున్న స్థానికులు
అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన దినకర్ ను స్థానికులు పట్టుకుని జీవన్ భీమానగర్ పోలీసులకు అప్పగించారు. ప్రియురాలు లీలా పవిత్రా తనను దూరం పెట్టిందని రగిలిపోయిన దినకర్ ఆమెను దారుణంగా హత్య చెయ్యడం బెంగళూరులో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బతకడానికి బెంగళూరు వచ్చిన ప్రేమికుల్లో ఒకరు హత్యకు గురికావడం, మరోకరు జైలుకు వెళ్లడంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications