Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో రైళ్లు ఢీకొన్న ఘటనపై సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

చెన్నై: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్యాసింజర్.. కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. సిగ్నల్ అందక మెయిన్ లైన్‌పై ఆగివున్న ప్యాసింజర్‌ను.. అదే ట్రాక్‌పై వచ్చిన విశాఖపట్నం-రాయగఢ మధ్య నడిచే పలాస ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీకొట్టింది.

ఈ ఘటనతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. తొమ్మిది మంది మరణించారు. 29 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని విశాఖ ఎన్ఆర్‌ఐ ఆసుపత్రి, మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులందరూ ఏపీకి చెందినవారే.

Andhra train accident 2023: its urgently to enhance train safety, says cm Stalin

ఈ రైలు ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాణ్యమైన వైద్య సహాయన్ని అందించాలని కోరారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన సంభవించిన కొద్ది నెలల వ్యవధిలో అలాంటి ప్రమాదమే మళ్లీ చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. దేశంలో లక్షలాదిమంది తమ ప్రయాణాల కోసం రైల్వేలపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు.

Andhra train accident 2023: its urgently to enhance train safety, says cm Stalin

ప్రజా రవాణాలో అత్యంత కీలకమైన రైల్వేల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవించడం.. ప్రమాద ఘంటికలను సూచిస్తోందని స్టాలిన్ చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ.. తన భద్రత చర్యలను అత్యవసర పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరింత మెరుగుపర్చుకోవాలని చెప్పారు.

తరచూ సంభవించే ప్రమాదాల వల్ల రైల్వే వ్యవస్థపై ప్రయాణికు తమ విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం.. కాలానుగుణంగా రైల్వే నెట్‌వర్క్ ఆధునికీకరణ, భద్రత చర్యల పెంపుపై నిర్ణయాలను తీసుకోవాలని స్టాలిన్ సూచించారు. మున్ముందు రైలు ప్రమాదాలు జరక్కుండా నివారించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+