పోలీసు కస్టడీకి మలయాళం హీరో దిలీప్, బెయిల్ ఇస్తే గోవిందా, అందర్నీ బెండ్ తీస్తే !
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కు సినిమా కష్టాలు మొదలైనాయి. ఆయన పెట్టుకున్న జామీను అర్జీని న్యాయస్థానం తిరస్కరించింది. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో దిలీప్ ను విచారణ
కొచ్చి: నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కు సినిమా కష్టాలు మొదలైనాయి. ఆయన పెట్టుకున్న జామీను అర్జీని న్యాయస్థానం తిరస్కరించింది. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో దిలీప్ ను విచారణ చెయ్యడానికి వారం రోజులు కస్టడీకి ఇవ్వాని కేరళ పోలీసులు ఆగమాలి కోర్టులో మనవి చేశారు.
అయితే హీరో దిలీప్ ను రెండు రోజుల పాటు విచారణ చెయ్యడానికి న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. గురువారం సాయంత్రం మళ్లీ దిలీప్ ను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులకు సూచించారు. న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో పోలీసులు కొచ్చి సమీపంలోని అలువ సబ్ జైలు చేరుకున్నారు.

బెయిల్ ఇవ్వండి
దిలీప్ ను కస్టడీలోకి తీసుకుని కొచ్చిలోని కేరళ పోలీసు క్లబ్ లో విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. హీరో దిలీప్ కు బెయిల్ ఇప్పించడానికి ఆయన తరపు న్యాయవాది కే. రామ్ కుమార్ చాల ప్రయత్నాలు చేశారు. దిలీప్ కు బెయిల్ ఇవ్వడానికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సాక్షాలు తారుమారు చేస్తే ?
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో నటుడు దిలీప్ కు ప్రమేయం ఉందని బలమైన సాక్షాలు ఉన్నాయని, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని కేరళ పోలీసులు కోర్టులో మనవి చేశారు.

బెదిరించే అవకాశం ఉంది ?
హీరో దిలీప్ కు చాల పలుకుబడి ఉందని, ఆయన బెయిల్ మీద బయటకు వెస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే దిలీప్ కు వ్యతిరేకంగా సాక్షాలు ఉన్నాయని పోలీసులు ఎలా చెబుతారు అంటూ ఆయన తరపు న్యాయవాది రామ్ కుమార్ వాదిస్తున్నారు.

నటి కేసు కథ తేల్చేయాలని !
మొత్తం మీద రెండు రోజులు దిలీప్ ను కస్టడీలోకి తీసుకున్న తరువాత ఈ కేసు విచారణ ఓ కొలిక్కి తీసుకురావాలని కేరళ పోలీసు భావిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ డి. సంధ్య కేసు విచారణ బాధ్యలను పర్యవేక్షిస్తున్నారు.

బెండ్ తీస్తే విషయం చెప్తారని ?
హీరో దిలీప్, దర్శకుడు, నిర్మాత నాదిర్ షా, ఈ కేసులో ప్రముఖ నిందితుడు పల్సర్ సునీని ఒకే చోట కుర్చోపెట్టి విచారణ చేస్తే మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయని ఓ పోలీసు అధికారి అంటున్నారు. దర్శకుడు, నిర్మాత నాదిర్ షాను పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు.












Click it and Unblock the Notifications