వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్మకు కౌంటరా..! : హాట్ కామెంట్స్ పై మహిళా ఎమ్మెల్యే ఫైర్

|
Google Oneindia TeluguNews

అసోం : అసలే వివాదాల దర్శకుడని పేరు.. అంతకుమించి వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్.. ఇంకేముంది ఒక్క ట్వీటేస్తే చాలు. ఇటు మీడియాకు, అటు జనానికి బోలెడంత చర్చ. రామ్ గోపాల్ వర్మ తాజా కామెంట్స్ పై కూడా ప్రస్తుతం ఇదే తరహాలో చర్చ జరుగుతోంది. అయితే, విషయంలోకి ఎంటర్ అయిన అసోం ఎమ్మెల్యే అంగూర్ లతా డేకా, తనని వివాదస్పద వ్యాఖ్యలను ఖండించారు.

 ఇంత అందమైన ఎమ్మెల్యే ఉంటే..: బీజేపీ మహిళా ఎమ్మెల్యేపై వర్మ ఇంత అందమైన ఎమ్మెల్యే ఉంటే..: బీజేపీ మహిళా ఎమ్మెల్యేపై వర్మ

కొత్తగా ఎన్నికైన అసోం ఎమ్మెల్మే అంగూర్ లతాని టార్గెట్ చేస్తూ.. మంగళవారం ట్విట్టర్ ద్వారా పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు వర్మ. 'ఎమ్మెల్యేల ఇంత అందంగా ఉన్నారంటే, మంచి రోజులు వచ్చేసినట్టే, థ్యాంక్యూ అంగూర్ లతాజీ, థ్యాంక్యూ మోడీజీ.. మీవల్ల మొదటిసారి నాకు రాజకీయాలపై ప్రేమ పుడుతోంది' అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ పోస్ట్ చేశారు.

ఇంత అందమైన ఎమ్మెల్యే ఉంటే..: బీజేపీ మహిళా ఎమ్మెల్యేపై వర్మఇంత అందమైన ఎమ్మెల్యే ఉంటే..: బీజేపీ మహిళా ఎమ్మెల్యేపై వర్మ

అయితే విషయం కాస్త.. దీనిపై స్పందించిన అంగూర్ లతా తనపై వస్తోన్న అభ్యంతరకర వ్యాఖ్యలకు గట్టిగానే సమాధానమిచ్చారు. 'సమాజంలో మార్పును ఆశించే తాను రాజకీయాల్లోకి వచ్చానని, సెలబ్రిటీ అయినంత మాత్రానా తనపై దుష్ప్రచారం చేయాలనుకోవడం సరికాదన్నారు. తాను అందంగా కనిపించడమనేది దేవుడిచ్చిన వరంగానే భావిస్తానని' పేర్కొన్నారు.

కాగా.. దేశం సాంకేతికంగా ఎదిగినా మానసికంగా మాత్రం ఎదిగినట్టు కనిపించడం లేదని వెల్లడించిన అంగూర్ లతా, సోషల్ మీడియాలో వైరల్ గా విస్తరిస్తున్న తన ఫోటోల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావడానికి మోడీయే ప్రధాన కారణమని చెప్పిన ఆమె, ఇలాంటి వివాదాలను తాను ఖాతరు చేయబోనని తేల్చేశారు.

English summary
assam mla angoor lata responded over ramgopal varma controversial tweets about her beautiness
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X