అన్న కొడుకు పెళ్లిలో... బ్యాగులు మోసుకుంటూ అనిల్ అంబానీ..!
గత వారం రోజులుగా ఎక్కడ చూసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి.
బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్ , ధోనీ, బాలీవుడ్ ప్రముఖులు షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్, తెలుగు ఇండస్ట్రీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరైయ్యారు.ఇదిలా ఉంటే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అనిల్ అంబానీ ఓ సాధారణ అతిథిగా హాజరైయ్యారు. సొంత అన్న కుమారుడు పెళ్లికి సాధాసీదాగా కనిపించి షాకిచ్చారు.

అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అన్షుల్‌తో కలిసి అనామకుడిలా ఎంట్రీ ఇచ్చారు. అనిల్ అంబానీ కుమారులైతే బ్యాగులు మోసుకుంటూ కనిపించారు. అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా సాధారణంగానే కనిపించింది. ఇక వారి కుటుంబ సభ్యులు కూడా సింపుల్‌గా దర్శనం ఇచ్చారు. అనిల్ అంబానీ ఫ్యామిలీ వచ్చిన సందర్భంలో ఫొటోలు తీసేందుకు కూడా ఫొటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం సంచలనంగా మారింది.
#WATCH | Reliance Group Chairman Anil Ambani and his wife Tina Ambani arrive in Jamnagar, Gujarat for the three-day pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant.
— ANI (@ANI) March 1, 2024
Their sons Jai Anmol and Jai Anshul are also here in the city; Jai Anmol's wife Khrisha Shah is also… pic.twitter.com/CvqA9Gqn9Y
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిల్ అంబానీ ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉండవారు. 2020లో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద సున్నా అని, తాను దివాలా తీసినట్లు ప్రకటించారు. ఒకప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉండగా.. ఇప్పుడు ఆయన ఆస్తి రూ. 250 కోట్లుగా అంచనా. ఆస్తి పంపకాల్లో టెలీ కమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ వంటివి దక్కాయి.అయితే వాటిని నెలబెట్టుకోవడంలో అనిల్ అంబానీ ఫెయిల్ అయ్యారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications