నో శాలరీ, నో కమీషన్: అనీల్ అంబానీ సంచలన నిర్ణయం
రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మన్ అనీల్ ధీరూబాయ్ అంబానీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ఎలాంటి జీతం గానీ కమీషన్ గానీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మన్ అనీల్ ధీరూబాయ్ అంబానీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ఎలాంటి జీతం గానీ కమీషన్ గానీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

అప్పుల్లో ఆర్‌కాం
వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్‌ను ఆదుకునేందుకే అనీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి జీతం లేదా కమీషన్ గానీ స్వీకరించకూడదని అనీల్ అంబానీ నిర్ణయించుకున్నారని సంస్థ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.

అనీల్ తోపాటు
వ్యూహాత్మక పరివర్తన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ల బాధ్యతతోపాటు, ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆర్‌కాం మేనేజ్‌మెంట్ కూడా ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. సంస్థ బోర్డు సభ్యులు కూడా 21 రోజుల వేతనం వదులుకోవాలని నిర్ణయించారు.

42వేల కోట్ల అప్పులు
డిసెంబర్ 2017 వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ స్పష్టం చేసింది. కాగా, ఈయేడాది చివరి వరకు ఆర్ కాం అప్పు రూ.42వేల కోట్ల అప్పును తీర్చాల్సి ఉంది.

వాటా విక్రయంతో 11వేల కోట్ల రాబడి
ఈ క్రమంలో రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఎయిర్ సెల్, బ్రూక్ ఫీల్డ్‌లకు టవర్ యూనిట్ రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌లో 51శాతం వాటాను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీంతో రూ. 11వేల కోట్లు ఆర్ కామ్‌కు లభించనుంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications