'ఆ ఐదు సలహాల్ని మోడీ పాటించి ఉంటే! పరిస్థితి ఇలా ఉండకపోయేది'

ఐదు అంశాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేస్తే.. అందులోంచి కేవలం రెండు సలహాలను మాత్రమే మోడీ సర్కార్ అమలు చేసిందని పేర్కొన్నారు అనిల్ బోకిల్.

న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ 2014లో ప్రధాని నరేంద్ర మోడీకి సలహా ఇచ్చిన అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ తాజాగా దీనిపై స్పందించారు. నోట్ల రద్దుకు సంబంధించి తాను ఐదు అంశాలతో కూడిన సమగ్ర నివేదికను మోడీకి అందజేశానని.. రద్దు అంశాన్ని ఎలా అమలు చేయాలి?, ఆ తర్వాత పరిస్థితులను ఎదుర్కోవాలి? అనే అంశాలను అందులో పేర్కొన్నట్టుగా తెలిపారు.

అయితే తాను ఐదు అంశాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేస్తే.. అందులోంచి కేవలం రెండు సలహాలను మాత్రమే మోడీ సర్కార్ అమలు చేసిందని పేర్కొన్నారు అనిల్ బోకిల్. తమ సంస్థ తరుపున అందజేసిన రోడ్ మ్యాప్ ను యథాతథంగా అమలు చేసి ఉంటే.. దేశవ్యాప్తంగా ఇంత గందరగోళం నెలకొని ఉండేది కాదన్నారు.

Anil Bokil, man who suggested demonetisation to PM Narendra Modi, slams implementation of policy

కాగా, ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల రద్దు, కేంద్ర పన్నుల రద్దు, బ్యాంకుల ద్వారా పన్ను చెల్లింపు, విత్ డ్రా చేసుకునే డబ్బుపై పన్ను విధించకపోవడం, నగదు లావాదేవీలకు చట్ట పరిమితి మరియు పెద్ద నగదు నోట్ల రద్దు వంటి అంశాలను మోడీకి అందజేసిన నివేదికలో అనిల్ బోకిల్ పొందుపర్చారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. మరోసారి మోడీతో భేటీ అయ్యి గత నివేదికలో సమర్పించిన అంశాల గురించి ఆయనతో చర్చించాలనే యోచనలో అనిల్ బోకిల్ ఉన్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+