పాకిస్థాన్ అణ్వాయుధ కేంద్రం 'కిరాణా హిల్స్' పై భారత్ డ్రోన్ దాడి.. మాజీ సీడీఎస్ క్లారిటీ..!

పాకిస్థాన్- భారత్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో పాకిస్థాన్ ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. దాంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది.

వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్ అలాగే కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లు ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. వీటితో పాటు పాకిస్థాన్ లో అక్రమంగా ఉగ్ర కలాపాలు సాగిస్తున్న అనేక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.

వాటిల్లో పాకిస్థాన్ అణ్వాయుధ కేంద్రంగా ఉన్న కిరాణా హిల్స్ కూడా ఒకటి. అయితే తాజాగా భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఇందుకు సంబంధించిన సంచలన విషయాన్ని బయటపెట్టారు. పాకిస్థాన్ సర్గోధా సమీపంలోని కిరాణా హిల్స్‌ పై భారత డ్రోన్ దాడి చేసిన విషయం నిజమేనని తెలిపారు. కానీ ఆ దాడి ఉద్దేశపూర్వకంగా జరగలేదని పేర్కొన్నారు. చుట్టుపక్కల రాడార్ల కోసం గమనిస్తున్న సమయంలో ఇంధనం అయిపోయినట్లు జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. దాంతో భారత డ్రోన్ కిరాణా హిల్స్ ను ఢీ కొట్టి ఉండొచ్చని వివరించారు.

AnilChauhan Attack on Pakistan s Kirana Hills nuclear site Former CDS reveals a sensational truth

తాజాగా వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ లో జరిగిన 'విమర్శ' అనే కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ చౌహాన్ 'ఆపరేషన్ సింధూర్‌'.. దాని సుదూర వ్యూహాత్మక పరిణామాల గురించి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ముగిసి ఏడాదికి పైగా అయినప్పటికీ.. కొన్ని అంశాలలో దాని ప్రభావం నేటికీ కనిపిస్తూనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ భారత్, విదేశాలలో ఉన్న వ్యూహాత్మక నిపుణుల మధ్య తీవ్ర ఆసక్తిని రేకెత్తించే అంశంగానే కొనసాగుతోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+