మాజీ ప్రధాని కోడళ్ల కోల్డ్ వార్, తోడికోడలికి షాక్ ఇచ్చిన మరో కోడలు, మాజీ సీఎం రివర్స్ గేర్ తో హీరో !

బెంగళూరు/రామనగర/హాసన్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ట్విస్ట్ ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఫ్యామిలీలో ఎమ్మెల్యే టిక్కెట్ ల ఫైట్ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని దేవేగౌడ కోడలు ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే. మరో కోడలు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని పట్టుబడుతున్నారు. మాజీ ప్రధాని కోడళ్ల కోల్డ్ వార్ లో మాజీ సీఎం రివర్స్ గేర్ వేశారు.

సొంత పార్టీలో, సొంత కుటుంబ సభ్యుల మధ్య ఎమ్మెల్యే టిక్కెట్ విషయంలో రచ్చరచ్చ జరగడంతో మాజీ ప్రధాని హెచ్ డీ, దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ, కుమారస్వామి విసిగిపోయారని తెలిసింది. ఈ దెబ్బతో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కోడలు జేడీఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనితా కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 bhavanianithakumaraswamy

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను రామనగర నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యనని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి తేల్చి చెప్పారు. తన కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి రామనగర నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యే అనితా కుమారస్వామి తేల్చి చెప్పారు.

తనను రామనగర నుంచి పోటీ చెయ్యాలని ఎవ్వరూ తన మీద ఒత్తిడి చెయ్యకూడాదని అనితా కుమారస్వామి జేడీఎస్ కార్యకర్తలకు మనవి చేశారు. మాజీ ప్రధాని కోడలిగా, జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామి భార్యగా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు ఓటములు చవిచూశానని, అయితే పార్టీ ఆదేశాల మేరకు పనిచేశాను తప్పా, తాను ఏరోజు హద్దలు మీరలేదని, ఇక ముందుకూడా అలాగే ఉంటానని, ఇక ముందు రామనగర నియోజక వర్గం నుంచి తాను పోటీ చెయ్యనని, తన కుమారుడు నిఖిల్ పోటీ చేస్తారని అనితా కుమారస్వామి మంగళవారం వరుస ట్విట్లు చేసి జేడీఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు.

మాజీ ప్రధాని మరో కోడలు భవాని రేవణ్ణ హాసన్ నియోజక వర్గం టిక్కెట్ కావాలని పదేపదే ఒత్తిడి చెయ్యడం, ఆ సీటు ఇవ్వడానికి కుమారస్వామికి ఇష్టం లేకపోవడంతో మాజీ ప్రధాని దేవేగౌడ కోడళ్ల విషయంలో కోల్డ్ వార్ మొదలైయ్యిందని తెలిసింది. అనితా కుమారస్వామికి టిక్కెట్ ఇస్తే భవాని రేవణ్ణకు టిక్కెట్ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే అనితా కుమారస్వామిని పోటీ నుంచి తప్పించి ఇటు భవాని రేవణ్ణకు చెక్ పెట్టేశారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+