భార్య ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డ్: ఫేస్ బుక్ లో ఆగ్రా వాసి వినూత్నం

ఆగ్రా: భార్య తప్పిపోయిందని ఓ భర్త తీవ్రంగా మధనపడుతున్నాడు. ఆమెను వెతికేందుకు నానా అగచాట్లు పడుతున్నాడు. తన భార్య ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎంచుకొంటున్నాడు. తన భార్య ఆచూకీ తెలిపితే లక్ష రూపాయాలను ఇస్తానని ఫేస్ బుక్ లో ప్రకటించాడు ఓ భర్త .

ఎవరైనా తప్పిపోతే పోస్టర్లు అంటించడం , వీధులు పట్టుకొని తిరుగుతూ కన్పించిన వారిని అడగడం, పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటాం.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా పవర్ పుల్ కావడంతో ఆగ్రాకు చెందిన అంకిత్ అనే వ్యక్తి తన భార్య ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయాలను బహుమతిగా ఇస్తానని ఫేస్ బుక్ లో ప్రకటించారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.

Ankit offers cash reward on Facebook for information on missing wife

ఆగ్రాకు చెందిన అంకిత్ రాగ్ భార్య జ్యోతి 2016 ఆగష్టు 24వ, తేదిన తప్పిపోయింది. ఏడు నెలల నుండి ఆమె ఆచూకీ కోసం ఆయన వెతుకుతున్నాడు.కాని ఆమె ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఆమె ఆచూకీ కోసం ఆయన విస్తృతంగా గాలిస్తున్నాడు.తన ఫోన్ నెంబర్ ను ఫేస్ బుక్ పోస్ట్ చేసి తన భార్య ఆచూకీ వివరాలను ఇవ్వాలన్నారు.

తన భార్య కన్పించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. తన భార్యను ఆ దేవుడే కాపాడుతాడని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. కానీ, మగాళ్ళ చేతుల్లో ఎక్కడ తన జీవితం నాశనమైతోందన్న బాధ తనను కలిచివేస్తోందన్నారు.

తాను గ్రోసరి స్టోర్ నిర్వహించడం వల్ల బిజీగా ఉన్నానని, అయితే ఇంటికెళ్ళి డ్రై ప్రూట్స్ తెమ్మని అర్జున్ ను పంపించాను,. కొద్దిసేపటి తర్వాత వచ్చిన అర్జున్.... ఇంటి తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయన్నారు. మీ భార్య కన్పించడం లేదన్నారు.

దీంతో కంగారుగా ఇంటికెళ్ళి చేస్తే తన భార్య కన్పించడం లేదన్నారు. ఇరుగుపొరుగు వారిని అడిగినా ఫలితం లేకపోయిందన్నారు.ఆమె ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ చేసి ఉందన్నారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసినా ఫలితం లేకోపవడంతో ఫేస్ బుక్ లో రివార్డ్ ఆఫర్ చేశాడు అంకిత్.ఆమె ఆచూకీ తెలిపినవారికి 9084641405, 9897930604 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+