అంకిత్‌కు చిక్కులు: రేప్ వీడియోతో బెదిరింపులు?

తనకు, అంకిత్ తివారీకి మధ్య జరిగిన విషయాలను వెల్లడించింది. మిడ్డేతో ఆమె మాట్లాడింది. ఏడాది క్రితం దుర్గా పూజ సందర్భంగా తాను అంకిత్‌ను కలిసినట్లు తెలిపింది. రెండేళ్ల క్రితం తాము పెళ్లి చేసుకున్నట్లు, తాను 3 కోట్ల రూపాయలు గుంజినట్లు అంకిత్ తివారీ న్యాయవాది చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది.
అంకిత్‌కు తానే మొబైల్ కొనిచ్చానని, మొబైల్ బిల్లు కూడా చెల్లించానని ఆమె చెప్పింది. తనపై అత్యాచారం ఎలా జరిగిందనే విషయంపై మిడ్డేకు వివరించింది. తన సోదరి జన్మదిన వేడుకల కోసం అంకిత్ తన ఇంటికి వచ్చాడని, తనతో పానీయం తాగించి, తన గదిలో తనతో లైంగిక క్రీడ సాగించాడని ఆమె చెప్పింది.
విషయంపై తన సోదరి ప్రశ్నించగా, పెళ్లి చేసుకుంటానని అంకిత్ హామీ ఇచ్చాడని ఆమె చెప్పింది. లైంగిక క్రీడను అంకిత్ చిత్రీకరించాడని, దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తూ వచ్చాడని ఆమె చెప్పింది. దాంతో తాను మౌనంగా ఉండిపోయానని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications