బీజేపీ అందుకే వీడా, కొత్త పార్టీ పై అన్నామలై సంచలన ప్రకటన- రజనీకాంత్ కోరినా..!!
ఊహించిందే జరిగింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కీలక ప్రకటన చేసారు. బీజేపీకి చేసిన రాజీనామాను ఆ పార్టీ నాయకత్వం ఆమోదించింది. బీజేపీకి తాను భారం కాదలుచుకోలేదని వెల్లడించారు. తాను మార్పు కోసమే ఉద్యోగం వదలి బీజేపీలో చేరానని చెప్పారు. బీజేపీ భవిష్యత్ కోసం తాను ఎంతో చేసానని వివరించారు. తమిళనాడు డెవలప్ మెంట్ తన లక్ష్యమని వెల్లడించారు. ఇక కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్ తో జరిగిన చర్చలను వివరించారు.
బీజేపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న అన్నామలై ఆ పార్టీకి దూరమయ్యారు. అన్నామలై రాజీనామా ను బీజేపీ ఆమోదించింది. ఆ తరువాత అన్నామలై కీలక ప్రకటన చేసారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. తమిళనాడులో కొత్త పార్టీకి అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో చేరే సమయంలో ప్రముఖ హీరో రజనీ కాంత్ నుంచి ఆహ్వానం వచ్చిందని.. అయినా, తాను బీజేపీలో చేరానని గుర్తు చేసారు. తమిళనాడులో బీజేపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. తనకు ప్రధాని మోదీ పైన ఎంతో అభిమానం.. గౌరవం ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తనతో కలిసి వచ్చే వారితో ముందుకు వెళ్తానని ప్రకటించారు. బీజేపీలో కొనసాగుతున్న సమస్యలో తాను చేసిన ప్రయత్నాలు.. ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు.

బీజేపీ వీడినా ప్రధాని పై గౌరవం తగ్గదు
18 నెలల కాలంగా బీజేపీతో విభేదాలు కొనసాగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అధికారం ఎవరికీ శాశ్వతం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాను బీజేపీలో పని చేసిన ఆరేళ్ల కాలంలో రాజకీయంగా ఎంతో నేర్చుకున్నానని అన్నామలై చెప్పారు. ఇక, కొత్త రాజకీయ వ్యవస్థ రూపొందిస్తామని పేర్కొన్నారు. తాను భారతీయుడిగా.. తమిళ వ్యక్తిగా గర్వపడుతానని చెప్పుకొచ్చారు. అయితే.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా కాకుండా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవటం అన్నామలైకి ఏమాత్రం ఇష్టం లేదని ఆయన అనుచరులు తెలిపారు. తమిళనాట బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని పార్టీ పెద్దలతో అన్నామలై పదే పదే చెప్పారట. అధ్యక్షుడి పదవి నుంచి తొలగించటం.. తన మాట వినకుండా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవటం అన్నామలై అవమానంగా భావించారట. ఈ కారణాలతోనే పార్టీ వీడినట్లు అనుచరులు చెప్పారు. బీజేపీని వీడిన అన్నామలై ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటనతో తమిళనాట రాజకీయం లో కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications