యష్ 'టాక్సిక్' పై అన్నామలై షాకింగ్ రివ్యూ..!
రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ మూవీ 'టాక్సిక్' ఆగస్టు 26న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ తొలి రోజు మాత్రం ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్లపై ఆ ప్రభావం పడలేదు.
మరోవైపు ఈ మూవీ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. పలువురు ప్రముఖ నటులు నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రంలో మహిళలను మితిమీరిన శృంగార కోణంలో చూపించడం, వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శించడం వంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే అంశంపై తాజాగా బీజేపీ మాజీ నేత, 'వీ ది లీడర్స్' వ్యవస్థాపకుడు అన్నామలై తీవ్రంగా స్పందించారు. సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిపైనా ప్రశ్నలు సంధించారు.
సినిమాల్లో మహిళల చిత్రీకరణ విషయంలో సెన్సార్ నిబంధనలను మరింత కఠినంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో పెద్ద తారలు నటించినప్పటికీ.. ఏ సన్నివేశాలను ప్రదర్శించవచ్చో నిర్ణయించే విషయంలో సెన్సార్ బోర్డు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
మహిళలను ఒక నిర్దిష్ట దృక్పథంతో చూపించే సినిమాలను పిల్లలు చూస్తే అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై పిల్లలకు ఉన్న ధోరణి మారుతుందని ఫైర్ అయ్యారు. అసలు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిపైనా అన్నామలై ప్రశ్నలు సంధించారు. ఇలాంటి సినిమాకు తొలి రోజే రూ. 104 కోట్లు రావడం ఏంటని ఫైర్ అయ్యారు. ఈ మేరకు మహిళల భద్రత, గౌరవం కోసం తాము పట్టణాలు, కళాశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నామలై పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఇటీవల హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో యష్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు మద్దతుగా నిలిచారు. ప్రతి మహిళ తనకు ఎదురైన ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని తన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేసి సమాజంలో విజయం సాధించగలదనే విషయాన్ని ఈ సినిమా చూపిస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications