మావోయిస్ట్ లకు మరో బిగ్ షాక్.. భారీ ఆయుధ కర్మాగారం ధ్వంసం!

ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు లొంగుబాటు బాట పట్టారు. ఇప్పటికే ఛత్తీస్ గడ్ అడవుల్లో జరుగుతున్న మహా యుద్ధంలో అనేకమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, ప్రభుత్వం ఊపిరాడనివ్వకుండా చేస్తున్న దాడి నేపథ్యంలో పలువురు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులను మట్టుపెట్టి పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసిన క్రమంలో లొంగిపోయిన చాలామంది మావోయిస్టులు, ఇంకా మిగిలి ఉన్న వారిని కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మావోయిస్టులకు చెందిన ఆయుధాల తయారీ కర్మాగారం ధ్వంసం
అయితే కేంద్రం నుంచి వచ్చిన బలగాలతో పాటు, డిస్టిక్ రిజర్వ్ బలగాలు ఛత్తీస్ గడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా బోర్డర్స్ లో ఉన్న అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతూ మావోయిస్టులను ఏరి వేయడంతో పాటు, పలు డంప్ లను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు చెందిన ఆయుధాల తయారీ కర్మాగారాన్ని డి ఆర్ జి బలగాలు ధ్వంసం చేశాయి.

Another big shock for the Maoists A huge weapons factory was destroyed in sukma district

Take a Poll

ఆయుధ కర్మాగారంలో ఆయుధాలు స్వాధీనం
గోంగూడ కంచాల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ లో భాగంగా అక్కడ ఒక భారీ ఆయుధ కర్మాగారం ఉన్నట్టుగా గుర్తించారు. ఈ ఆయుధ కర్మాగారం బెటాలియన్ నెంబర్ వన్ కు చెందినదని గుర్తించిన అధికారులు ఈ ప్రాంతం నుండి 17 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు, ఆయుధాలు తయారీకి సంబంధించిన సామాగ్రి, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయుధ కర్మాగారాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.

ఫ్యాక్టరీలో వాటిని స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ
ఇదే విషయాన్ని ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. కొద్ది వారాల క్రితం లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన కచ్చితమైన సమాచారంతో ఆయుధ ఫ్యాక్టరీ గుర్తించామని ఆయన తెలిపారు. ఆ స్థావరంలో ఆర్మీ రైఫిల్స్ తో సరితూగే ఆయుధాలను తయారు చేసేందుకు సంబంధించిన బ్లూ ప్రింట్లను కూడా కనుగొన్నట్టు పేర్కొన్నారు. మందు పాతర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ లు, సర్క్యూట్ బోర్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు.

ఎన్కౌంటర్లలో 249మంది నక్సలైట్ల హతం
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం జరిగిన ఎన్కౌంటర్లలో 249మంది నక్సలైట్లను మట్టి పెట్టినట్టు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు వంటి అగ్ర నేతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇక వరుస దెబ్బలతో బలహీనపడిన మావోయిస్టులు, ఈ ఫ్యాక్టరీ ద్వారా పెద్ద ఎత్తున ఆయుధాలు తయారు చెయ్యాలని చూశారు కానీ మేము వారి ప్రయత్నాన్ని సమాధి చేసామని ఎస్పి స్పష్టం చేశారు.

లొంగిపోయిన మావోయిస్ట్ లపై మావోయిస్ట్ పార్టీ లేఖ
ఇదిలా ఉంటే ఇటీవల చాలామంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోగా మావోయిస్టు పార్టీ వారందరినీ దేశద్రోహులుగా అభివర్ణించింది. ఈ మేరకు పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో ఒక లేఖ తో పాటు, ఒక వీడియోను కూడా విడుదల చేశారు.వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+